మహిళలకు కేంద్రం గుడ్‌న్యూస్, 5 లక్షల వడ్డీ రహిత రుణాలు, ఎలాగంటే

www.mannamweb.com


కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు నిర్వహిస్తోంది. వీటిలో సేవింగ్ పథకాలతో పాటు రుణాలిచ్చే స్కీమ్స్ కూడా ఉన్నాయి. ప్రజల అవసరాలు, సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని వివిధ రకాల పథకాలు అందిస్తోంది.

ముఖ్యంగా పేదల కోసం కొన్ని ప్రత్యేక పధకాలున్నాయి. ఇటీవల కొత్తగా మహిళల కోసం మరో పధకం ప్రారంభించింది.

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఎన్నో పధకాల్లో కీలకమైంది మహిళలకు ఉద్దేశించిన లక్‌పతి దీదీ పథకం. ఈ పధకం మహిళల స్వయం సమృద్ధికి సంబంధించింది. మహిళలల్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ఈ పధకం ఉద్దేశ్యం. ఆర్ధికంగా మహిళలు నిలదొక్కుకునేలా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం లక్‌పతి దీదీ పధకం ప్రారంభించింది. ఈ పధకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మహిళలకు 5 లక్షల వరకూ రుణ సదుపాయం అందిస్తుంది. అది కూడా ఎలాంటి వడ్డీ లేకుండా లోన్ మంజూరు చేస్తుంది. ఈ పధకం ఎలా పొందాలో తెలుసుకుందాం.

గత ఏడాది ఆగస్టు 15న కేంద్ర ప్రభుత్వం లక్‌పతి దీదీ పధకం ప్రారంభిచింది. మహిళల స్వ.యం సమృద్ధి కోసం ఈ స్కీమ్ మొదలైంది. వ్యాపారం చేయడం ద్వారా అర్ధికంగా మహిళలు అభివృద్ధి చెందేలా చేయడమే ఈ పధకం ఉద్దేశ్యం. దీనికోసం మహిళలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్‌లో చేరాల్సి ఉంటుంది. అంటే డ్వాక్రా గ్రూపు సభ్యురాలు కావల్సి ఉంటుంది. ఇవి ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటాయి. మహిళలు సొంతంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలంటే బిజినెస్ ప్రాజెక్టుతో పాటు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారా రుణం కోసం అప్లై చేసుకోవాలి. స్థానికంగా ఏదో ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూపులో సభ్యురాలిగా ఉండాల్సి ఉంటుంది. సెల్ఫ్ హెల్ప్ గ్రూపులో మహిళలకు ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ ఇస్తుంది. మహిళల్లో ఉన్న స్కిల్స్ గుర్తించి వాటిని ఈ శిక్షణా శిబిరాల ద్వారా మరింతగా నైపుణ్యపరుస్తారు.

సెల్ఫ్ హెల్ప్ గ్రూపులో చేరిన తరువాత తాము చేయాల్సిన బిజనెస్ ప్రాజెక్టు రిపోర్టుతో లక్‌పతి దీదీ యోజన పథకానికి దరఖాస్తు చేయాలి. సంబంధిత సెల్ఫ్ హెల్ప్ గ్రూపు ద్వారా ఈ ప్రాజెక్టు రిపోర్ట్ ప్రభుత్వానికి చేరుతుంది. ప్రభుత్వం ఈ అప్లికేషన్ పరిశీలించి వడ్డీ లేకుండా 5 లక్షల వరకూ రుణం మంజూరు చేస్తుంది.