లవంగంతో ప్రయోజనాలు అన్ని ఇన్ని కాదండోయ్..! తప్పక తెలుసుకోవాల్సిందే

www.mannamweb.com


లవంగాలు మన శరీరానికి అనేక పోషకాలను అందిస్తాయి. లవంగాలలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఆయుర్వేదంలో లవంగాలను పూర్వం నుంచి ఉపయోగిస్తున్నారు. లవంగాలు సీజనల్‌ వ్యాధులు,ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచేలా చేస్తాయి. కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడం నుండి ఎముకల ఆరోగ్యం వరకు లవంగాలతో కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

లవంగాలలో ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, కార్బోహైడ్రేట్లు, హైడ్రాలిక్ యాసిడ్, విటమిన్ ఏ, మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. లవంగాల వినియోగం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కీళ్ల నొప్పులు, వికారం, కడుపునొప్పి, గ్యాస్ట్రిక్, దంత ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది.

రోజుకు ఒక లవంగాన్ని నమలడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. రోజూ ఉదయాన్నే రెండు లవంగాలను నమలడం వల్ల జీర్ణక్రియ జరుగుతుంది. తీవ్రమైన దగ్గుతో ఇబ్బంది పడుతున్న వారికి లవంగం మంచి ఉపశమానాన్ని ఇస్తుంది.

దంత సమస్యలను నివారించే శక్తి కూడా లవంగాలకు ఉంది. లవంగాలలో ఉండే యాంటీ జింజివిటిస్, యాంటీప్లేక్ లక్షణాలు దంతాలను ఆరోగ్యంగా ఉండటానికి సహయపడతాయి.. లవంగాలు నోటిలోని సూక్ష్మజీవులను నిరోధించడంలో సహాయపడటమే కాకుండా, చిగుళ్లలో ఇన్ఫెక్షన్, మంట, నొప్పి నుంచి ఉపశమనం అందిస్తాయి.

అంతేకాదు..లవంగాలను చక్కెర స్థాయిని నియంత్రించే శక్తి కూడా ఉంది. దీని కోసం లవంగం టీ తయారు చేసుకుని తీసుకోవాలి. ఇందుకోసం ఒక గ్లాసు నీటిలో 8-10 లవంగాలను మరిగించాలి. ఆ తరువాత, నీటిని ఫిల్టర్ చేసి కొద్దిగా చల్లారిన తర్వాత తాగాలి. దీంతో అద్భుత ప్రయోజనం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

చర్మ సమస్యలకు కూడా లవంగంతో చెక్‌ పెట్టొచ్చు అంటున్నారు నిపుణులు. ఇందుకోసం లవంగాన్ని మెత్తగా నూరి, మొటిమల మీద రాస్తే, మొటిమ పక్కకు విస్తరించకుండా త్వరగా రాలిపోతుంది. అలాగే, వాంతి అవుతుందనిపించినప్పుడు లవంగాన్ని వాసన చూడాలి. అలాగే లవంగం రసాన్ని చప్పరించినా ఫలితం ఉంటుంది.