ఈ రోజు నాటిన మొక్కనే రేపు భారీ వృక్షమై భావితరాలకు మేలు చేస్తుందనేది ఎంత నిజమో.. నేటి పెట్టుబడి రేపు మిమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేస్తుందనేది అంతే వాస్తవం.
అయితే మార్కెట్ లో పెట్టుబడి మార్గాలు చాలానే ఉన్నాయి. అందులో ఒకటే మ్యూచువల్ ఫండ్స్. పలు దిగ్గజ సంస్థలు ఈ మ్యూచువల్ ఫండ్స్ ఆఫర్ చేస్తుంటాయి. ఇవి స్టాక్ మార్కెట్ పనితీరును బట్టి రిటర్న్స్ ఇస్తాయి.
ఇటీవలి కాలంలో ఎక్కువ మంది పెట్టుబడి మార్గంగా మ్యూచువల్ ఫండ్స్‌నే ఎంచుకుంటున్నారు. మార్కెట్‌లో ఉన్న చాలా రకాల ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్నారు. దీంతో పలు అసెట్ మెనేజ్మెంట్ సంస్థలు కొత్త కొత్త ఫండ్స్ అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఇదే బాటలో ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్స్ (SBI Mutual Funds) సైతం ఎస్‌బీఐ క్వాంట్ ఫండ్ డైరెక్ట్ (SBI Quant Fund Direct) పేరుతో మరో కొత్త ఫండ్ పరిచయం చేసింది.
రిస్క్‌లను ప్రభావవంతంగా నిర్వహించేలా ఈ స్కీమ్ రూపొందించినట్లు, దీర్ఘకాలంలో పెట్టుబడులపై హైరిటర్న్స్ అందించడమే లక్ష్యంగా ఈ ఫండ్ తీసుకొస్తున్నట్లు SBI పేర్కొంది. ఇది పోర్ట్ ఫోలియోను బిల్డ్ చేసి ఈక్విటీ సంబంధిత మార్గాల్లో పెట్టుబడులు పెట్టనుంది. డిసెంబర్ 4 నుంచి ఈ న్యూ ఫండ్ ఆఫర్ (NFO) సబ్‌స్క్రిప్షన్ ప్రారంభం అయింది. డిసెంబర్ 18వ తేదీ వరకు సబ్‌స్క్రైబ్ చేసుకునేందుకు అవకాశం ఉంది. ఈ స్కీమ్ కనీస పెట్టుబడి రూ.5 వేలు. గరిష్టంగా ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు.