ప్రపంచవ్యాప్తంగా 12,500 స్క్రీన్లలో, ఆరు భాషల్లో భారీగా విడుదలైన పుష్ప2 ది రూలర్ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. జాతర ఎపిసోడ్ లో అల్లు అర్జున్ తన నటనలో విశ్వరూపాన్ని ప్రదర్శించి జాతీయ అవార్డుకు అర్హుడినని నిరూపించుకున్నాడు.
సుకుమార్ దర్శకత్వ ప్రతిభ చాలా బాగుందనే విషయం అందరికీ తెలిసిందే. ఉత్తర భారతదేశంలోని ప్రేక్షకులైతే ఈ సినిమాను, అల్లు అర్జున్ ను తమవాడుగా భావించుకుంటున్నారు. మనకన్నా వారే ఎక్కువగా ఈ సినిమా కోసం ఎదురు చూశారు. మొత్తానికి సినిమా విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఎంత సూపర్ హిట్ సినిమా అయినా, బ్లాక్ బస్టర్ సినిమా అయినా కొన్ని మైనస్ పాయింట్లు కూడా ఉంటాయి. పుష్ప2లో కూడా కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి. వాటిని ఒకసారి పరిశీలిద్దాం.
* సినిమాలో కొంత సాగదీత ఉంది. నిడివి 3 గంటల 20 నిముషాలు.
* చిత్తూరు యాసలో సంభాషణలు పలికే విధానంలో స్పష్టత లోపించింది.
* విలన్ బలంగా ఉంటే హీరో ఎలివేట్ అవుతాడు. ఈ సినిమాలో బలమైన విలనిజం లేదు.
* షెకావత్ ను బలంగా చూపిస్తే బాగుండేది.
* సునీల్, అనసూయ పాత్రలు సాదాసీదాగా ఉండి తేలిపోయాయి.
* సినిమా ప్రారంభంలో జపాన్ ఎపిసోడ్, బాల్యంలోని సన్నివేశం తీసేసినా నిడివి కలిసివచ్చేది.
* షెకావత్ కు పువ్వు పంపించడం, తర్వాత ఇద్దరూ సంజ్ఞలు చేసుకుంటూ సాగిన సన్నివేశం వృథా అనిపిస్తుంది.
* శ్రీవల్లి పీలింగ్స్ పాటలో అందాలను చాలా ఎక్కువగా ఆరబోసింది. ఇది సుకుమార్ స్థాయి కాదు.
* పుష్పను పట్టుకోవడం కోసం ఇతర రాష్ట్రాల్లో కూడా పోలీసులుంటారుగా అనే ఆలోచన ప్రేక్షకులకు వస్తుంది. షెకావత్ ఒక్కడే కాదు కదా? అనే ప్రశ్నవారిలో తలెత్తింది.
* పుష్ప స్నేహితుడిగా నటించి జగదీష్ భండారీతో పాత్ర విధానం చెప్పిస్తే బాగుండేది. అది పుష్ప2లో లేదు.
* అల్లు అర్జున్ చెప్పే డైలాగులను చాలా శ్రద్ధగా వినాల్సి ఉంటుంది. లేకపోతే వెంటనే అర్థంకావు.
* ఫహద్ ఫాజిల్ అద్భుతమైన నటనను కనబరిచాడు. అయితే ఆ పాత్ర ముగించిన విధానం నచ్చలేదు.
* తారక్ పొన్నప్పది సాధారణమైన పాత్రలానే కనపడింది.
* మెగా ఫ్యామిలీపై కౌంటర్లు లేకుండా ఉంటే బాగుండేది.