వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి (YSRCP MP Vijayasai Reddy)పై ఆంధ్రప్రదేశ్ సీఐడీ (CID) విభాగం లుక్ ఔట్ సర్క్యులర్ (Lookout notices) జారీ చేసింది. ఆయనతోపాటు వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy) కుమారుడు విక్రాంత్ రెడ్డి (Vikranth Reddy), అరబిందో యజమాని శరత్ చంద్ర రెడ్డి (Sarath Chandra Reddy)పై ఎల్వోసీ (LOC) ఇచ్చింది. ఈ ముగ్గురూ విదేశాలకు పారిపోకుండా ముందు జాగ్రత్తగా ఈ సర్క్యూలర్ జారీ చేసింది. కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్, కాకినాడ సెజ్‌లోని రూ. 3,600 కోట్ల విలువైన వాటాలను కర్నాటి వెంకటేశ్వరరావు, కేవీ రావు నుంచి గత ప్రభుత్వ హాయంలో బలవంతంగా లాగేసుకున్నారంటూ సీఐడీ నమోదు చేసిన కేసులో కీలక నిందితులుగా వీరున్నారు. వాటాలు రాసివ్వకపోతే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని కేవీ రావును బెదిరించి, భయపెట్టి అత్యధిక షేర్లను అరబిందో సంస్థ సొంతం చేసుకుందనేది ప్రధాన అభియోగం.