రాష్ట్ర ప్రజలు బంపరాఫర్ ఇచ్చేసింది కూటమి సర్కార్. గడిచిన ఐదేళ్లలో మీ భూములను ఎవరైనా లాక్కున్నారా? కబ్జాకు గురయ్యాయా? ఈ సమస్యలకు ఫుల్‌స్టాప్ పెట్టేందుకు శ్రీకారం చుట్టింది చంద్రబాబు ప్రభుత్వం.
ఏపీ ప్రజలు దీన్ని వినియోగించుకోవాలని కోరుతున్నారు.
గడిచిన ఐదేళ్లలో ఏపీలో చాలామంది భూములు కోల్పోయారు. అందులో బలవంతం తీసుకున్నవి ఉన్నాయి. భయపెట్టి తక్కువ మొత్తం చెల్లించి లాక్కున్నవి ఉన్నాయి. కొంతమందికి సంబంధించిన భూముల రికార్డులు తారుమారు చేయడం జరిగింది. మనకు తెలీకుండా మన భూములకు కంప్యూటర్‌లో తారుమారైన సందర్భాలు ఉన్నాయి.
కబ్జాకు గురైన వాటిలో రైతులు, సామాన్య ప్రజలు, ప్రభుత్వం, దేవాదాయ శాఖకు చెందిన భూములు లేకపోలేదు. వీటి సంగతి తేల్చేందుకు నడుం బిగించింది చంద్రబాబు ప్రభుత్వం. ఇందులో భాగంగా డిసెంబర్ ఆరు నుంచి వచ్చే ఏడాది జనవరి 8 వరకు రెవిన్యూ సదస్సులను నిర్వహిస్తోంది.
రోజుకో గ్రామంలో రెవిన్యూ సదస్సులను నిర్వహిస్తోంది. ఈ సదస్సుకు కలెక్టర్, ఆర్డీఓ, రెవిన్యూ, రిజిస్ట్రేషన్ శాఖ, ఎమ్మార్వో, తహశీల్దార్ వంటి అధికారులు రాబోతున్నారు. తమ సమస్యలను పేపర్‌పై రాసి అధికారులకు అందజేస్తే చాలు. కేవలం 45 రోజుల్లో సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కచ్చితంగా అధికారులు చెప్పాల్సిన అవసరం ఏర్పడింది.
ఈ విషయాన్ని వీడియో రూపంలో వెల్లడించారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు. దయచేసి ఈ అవకాశాన్ని భూములు కోల్పోయిన వారు వినియోగించుకోవాలని కోరారు. తర్వాత మా భూములు కబ్జా అయ్యాయని అరిచి గీ పెట్టినా ఫలితం ఉండదన్నారు.
గ్రామంలో సదస్సులు ఎప్పుడు పెడతారో తెలుసుకుని ఆ తరహా ఇబ్బందులున్న వారంతా వెళ్లి అధికారులకు వివరిస్తే ఫలితం లభిస్తుందన్నారు. రాజకీయాలతో ఎలాంటి సంబంధ లేదన్నారు. అన్ని పార్టీల నాయకులకు ఈ తరహా ప్రజల సమస్యలు తెలుసుకుని న్యాయం చేయాలని రిక్వెస్ట్ చేశారు.
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఇబ్బందులను తెలుసుకునేందుకు టీడీపీ, జనసేన పార్టీలు శ్రీకారం చుట్టాయి. ప్రజల నుంచి నేరుగా సమస్యలను తెలుసుకునేందుకు పార్టీ ఆఫీసులో మంత్రులు, ఎమ్మెల్యేలతో కమిటీని ఏర్పాటు చేసింది.
ప్రజల నుంచి ఎక్కువగా ఫిర్యాదు భూములు కబ్జాకు గురైనట్టు తేలింది. వందశాతం ఫిర్యాదుల్లో 80 శాతం భూకబ్జాలకు సంబంధించినవే వున్నాయి. దీంతో గడిచిన ఐదేళ్లలో ఏ స్థాయిలో భూములు కబ్జాలు అయ్యాయో చెప్పకనే చెప్పారు. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.
రీసెంట్‌గా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించారు కూడా. ఈ నేపథ్యంలో గ్రామంలో రెవిన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టింది. కేవలం నెల రోజులు మాత్రమే గడువు ఇచ్చింది. దీన్ని ప్రజలంతా వినియోగించుకోవాలని కోరింది. ఫిర్యాదు చేసిన నెలన్నర రోజుల్లో దీనికి పరిష్కారం లభించనుంది.
గడిచిన ఐదేళ్లు వైసీపీ.. కలెక్టరు కార్యాలయంలో ఇలాంటి వ్యవస్థని ప్రవేశపెట్టిన విషయం తెల్సిందే. గతంలో వైసీపీ ప్రభుత్వ జిల్లాలకు ప్రజలను రప్పించేది. ఇప్పుడు కూటమి సర్కార్ నేరుగా గ్రామంలో సదస్సులు పెట్టి.. సమస్యలకు ఫుల్‌స్టాప్ పెట్టేలా ప్లాన్ చేసింది.