మరో వీకెండ్ వచ్చేసింది. కానీ ప్రస్తుతం దేశం మొత్తం ‘పుష్ప 2’ ఫీవర్ నడుస్తోంది. ఎక్కడ చూసిన ఎవరితో మాట్లాడిన చర్చంతా ఈ మూవీ గురించే.
ఈ సినిమా టికెట్ దొరికితే సరేసరి లేదంటే చూసేందుకు ఓటీటీల్లోకి 20కి పైగా కొత్త సినిమాలు వచ్చేశాయి. వాటిలో తెలుగు స్ట్రెయిట్ మూవీస్ కూడా ఉన్నాయండోయ్.
పుష్ప 2 ‘జాతర’ సాంగ్ రిలీజ్ చేశారు!
)
ఓటీటీల్లో ఈ శుక్రవారం రిలీజైన సినిమాలు విషయానికొస్తే ఆలియా భట్ ‘జిగ్రా’, నరుడి బ్రతుకు నటన, అమరన్, మట్కా లాంటి చిత్రాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటే అగ్ని (హిందీ), సార్ (తమిళ) చిత్రాలు కూడా ఉన్నంతలో ఆసక్తి రేపుతున్నాయి. ఇంతకీ ఏయే సినిమా ఏ ఓటీటీల్లోకి వచ్చిందంటే?
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన సినిమాలు (డిసెంబరు 6)
అమెజాన్ ప్రైమ్
నరుడి బ్రతుకు నటన – తెలుగు సినిమా
అగ్ని – హిందీ మూవీ
ద టట్టాస్ – డచ్ సిరీస్
మొహ్రే – హిందీ సిరీస్
ద స్టిక్కీ – ఇంగ్లీష్ సిరీస్
మట్కా – తెలుగు సినిమా
నెట్‌ఫ్లిక్స్
జిగ్రా – తెలుగు డబ్బింగ్ సినిమా
ఏ నాన్సెన్స్ క్రిస్మస్ విత్ సబ్రినా కార్పెంటర్ – ఇంగ్లీష్ మూవీ
బిగ్గెస్ట్ హయస్ట్ ఎవర్ – ఇంగ్లీష్ సినిమా
క్యాంప్ క్రషర్ – స్పానిష్ చిత్రం
ఎకోస్ ఆఫ్ ద పాస్ట్ – అరబిక్ సిరీస్
హయాయో మియాజకీ అండ్ ద హెరోన్ – జపనీస్ మూవీ
మేరీ – ఇంగ్లీష్ సినిమా
అమరన్ – తెలుగు సినిమా
విక్కీ విద్యా కా వోహ్ వాలా వీడియో – హిందీ మూవీ (డిసెంబర్ 7)
ఆహా
మందిర – తెలుగు సినిమా
జీ5
మైరీ – హిందీ సిరీస్
ఆహా
సార్ – తెలుగు డబ్బింగ్ సినిమా
జియో సినిమా
క్రియేచర్ కమాండోస్ – ఇంగ్లీష్ సిరీస్
లాంగింగ్ – ఇంగ్లీష్ సినిమా (డిసెంబర్ 7)
మనోరమ మ్యాక్స్
ఫ్యామిలీ – మలయాళ సినిమా
ఆపిల్ ప్లస్ టీవీ
ఫ్లై మీ టూ ద మూన్ – ఇంగ్లీష్ మూవీ
సోనీ లివ్
తానవ్ సీజన్ 2 – హిందీ సిరీస్