ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ వన్‌ప్లస్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇవాళ్టి నుంచి డిసెంబర్ 17 వ తేదీ వరకు వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఈ సేల్‌లో భాగంగా వన్‌ప్లస్ నార్డ్ 4, వన్‌ప్లస్ నార్డ్ CE 4, వన్‌ప్లస్ 12 వంటి హ్యాండ్‌సెట్‌లపై డిస్కౌంట్‌లను అందిస్తోంది. సేల్‌లో భాగంగా ఆఫర్‌లతో పాటు బ్యాంకు కార్డులపై మరింత డిస్కౌంట్‌ను పొందవచ్చని తెలిపింది. వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్‌లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, విజయ్ సేల్స్, రిలయన్స్ డిజిటల్ ప్లాట్‌ఫాంలు, స్టోర్‌లలో వన్‌ప్లస్ హ్యాండ్‌సెట్లు, గ్యాడ్జెట్‌లను డిస్కౌంట్ ధరలకు కొనుగోలు చేయవచ్చు.
వన్‌ప్లస్ ప్రత్యేక సేల్‌లో (OnePlus Community Sale 2024) భాగంగా వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్‌ను తగ్గింపు ధరకు సొంతం చేసుకోవచ్చు. ఐసీఐసీఐ బ్యాంకు కార్డులు, RBL క్రెడిట్ కార్డు, వన్ కార్డులపై గరిష్టంగా రూ.7,000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతోపాటు ఇతర ఎంపిక చేసిన బ్యాంకుల కార్డులపై రూ.3,000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.
వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్ (OnePlus 12 Smartphone) 6.82 అంగుళాల క్వాడ్ HD+ LTPO 4.0 అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత OxygenOS 14, క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. 100W సూపర్‌వూక్ వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 5400mAh బ్యాటరీని కలిగి ఉంది. దీంతోపాటు 50W వైర్‌లెస్ ఛార్జింగ్, 10W రివర్స్ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది. కెమెరా విభాగం పరంగా ఈ ఫోన్ 50MP సోనీ LTY-808 కెమెరా, 48MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 64MP పెరిస్కోప్ టెలిఫొటో లెన్స్‌ను కలిగి ఉంది. మరియు 32MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది.
వన్‌ప్లస్ 12 తోపాటు వన్‌ప్లస్ ఓపెన్ అపెక్స్ ఎడిషన్ పైనా డిస్కౌంట్‌లను పొందవచ్చు. వీటితోపాటు వన్‌ప్లస్ నార్డ్ CE 4 స్మార్ట్‌ఫోన్‌పై గరిష్ఠంగా రూ.2,000, మరియు నార్డ్ CE 4 లైట్ హ్యాండ్‌సెట్‌పైన రూ.2000, వన్‌ప్లస్ నార్డ్ 4 హ్యాండ్‌సెట్‌పై రూ.3,000 తగ్గింపును పొందవచ్చు. మరియు బ్యాంకు కార్డుల ద్వారా మరింత డిస్కౌంట్‌ను పొందవచ్చు.
వన్‌ప్లస్ నార్డ్ CE 4 లైట్ స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల పుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత OxygenOS 14, స్నాప్‌డ్రాగన్ 695 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. కెమెరా విభాగం పరంగా OIS సపోర్టుతో 50MP సోనీ LYT 600 కెమెరా, 2MP డెప్త్ సెన్సార్‌ను కలిగి ఉంది. మరియు 16MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 80W వైర్ Supervooc ఛార్జింగ్, 5W రివర్స్ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీను కలిగి ఉంది.
వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లతోపాటు వన్‌ప్లస్ ప్యాడ్ 2 (OnePlus Pad 2), వన్‌ప్లస్ ప్యాడ్ గో (OnePlus Pad Go) ట్యాబ్లెట్‌లపై వరుసగా రూ.3000, రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతోపాటు ఇయర్‌బడ్స్ పైనా డిస్కౌంట్‌లు వర్తిస్తాయని వన్‌ప్లస్ తెలిపింది. డిసెంబర్ 17 వరకు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది.