ఈపీఎఫ్ఓలో కీలక నిబంధనల మార్పు.. ఇకపై వారి క్లెయిమ్స్‌కు నో ఆధార్

www.mannamweb.com


ప్రస్తుత రోజుల్లో పీఎఫ్ విత్‌డ్రాకు ఆధార్ తప్పనిసరి. యూనివర్సల్ అకౌంట్ నంబర్‌ని ఆధార్‌తో తప్పనిసరిగా లింక్ చేయాల్సి ఉంది. అయితే ఇటీవల కొన్ని వర్గాల ఉద్యోగులకు ఈ నిబంధన నుంచి మినహాయింపునిచ్చారు.

దీంతో ఆధార్ లేని ఉద్యోగులు ఈపీఎఫ్ఓ క్లెయిమ్‌లు చేయవచ్చు.

ఆదార్ లేకుండా పీఎఫ్ విత్‌డ్రా చేయాలంటే పాస్‌పోర్ట్‌లు, పౌరసత్వ ధ్రువీకరణ పత్రాలు లేదా ఇతర అధికారిక గుర్తింపు కార్డుల వంటి ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాలు అవుతుంది. అలాగే రూ. 5 లక్షలకు మించిన క్లెయిమ్‌లను ప్రాసెసర్ చేయాలంటే యజమాని ధ్రువీకరణ తప్పనసరి అవుతుంది.

భారత్‌లో పనిచేసి, ఆధార్‌ను పొందలేకపోయిన అంతర్జాతీయ ఉద్యోగులు తమ స్వదేశాలకు తిరిగి వస్తే వారి పీఎఫ్ విత్‌డ్రాకు ఆధార్ అవసరం లేదు. అలాగే విదేశీ పౌరసత్వం ఉన్న భారతీయ పౌరులు, నేపాల్, భూటాన్ పౌరులుశాశ్వతంగా విదేశాలకు వెళ్లిన భారతీయ పౌరులు పీఎఫ్ విత్‌డ్రాకు ఆధార్ అవసరం లేదని ఈపీఎఫ్ఓ ఇటీవల స్పష్టం చేసింది.

అయితే ఇలాంటి క్లెయిమ్‌లను ఆమోదించే ముందు అన్ని క్లెయిమ్‌లను జాగ్రత్తగా పరిశీలించాలని ఈపీఎఫ్ఓ ​​అధికారులను ఆదేశించింది. ఇది అప్రూవల్ ఆఫీసర్-ఇన్-ఛార్జ్ ద్వారా ఈ-ఆఫీస్ ఫైల్ సిస్టమ్ ద్వారా ప్రాసెస్ చేస్తారు.

ఉద్యోగులు అదే యూఏఎన్‌ను నిర్వహించాలని లేదా వారి మునుపటి సర్వీస్ రికార్డులను అదే యూఏఎన్‌కు బదిలీ చేయాల్సి ఉంటుంది . ఎందుకంటే ఇది క్లెయిమ్ ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి, వేగవంతం చేయడానికి సహాయపడుతుంది.