యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకించీ చెప్పాల్సిన అవసరం లేదు. 2002లో ఈశ్వీర్ మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రభాస్…ఛత్రపతి సినిమాతో ప్రేక్షకులను కట్టిపారేశారు.
ఆ తర్వాత వచ్చిన అన్ని సినిమాలు కూడా ప్రభాస్ కు మంచి గుర్తింపు తెచ్చాయి. పౌర్ణమి, వర్షం, బుజ్జిగాడు, మిర్చి ఇలాంటి సినిమాలతో మాస్ ఆడియెన్స్ ను సైతం సొంతం చేసుకున్నారు. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాతో ఫ్యామిలీ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.
అనంతరం వచ్చిన బాహుబలి సినిమాతో ప్రభాస్ ప్రపంచ స్థాయికి ఎదిగిపోయారు. ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రభాస్ తర్వాతే ఎవరైనా అనే రేంజ్ కు వెళ్లిపోయారు. అయితే ప్రభాస్ కు ప్రస్తుతం 45ఏళ్లు. ఇప్పటి వరకు ఆయనకు వివాహం కాలేదు. దీంతో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉంటున్నారు. గతంలో లవ్ ఫెయిల్యూర్ అవ్వడం వల్లే ప్రభాస్ పెళ్లి చేసుకోలేదని కొంతమంది చెబుతుంటారు.
ఇంకొందరు మాత్రం ప్రభాస్, అనుష్క లవ్ లో ఉన్నారని చెబుతుంటారు. అంతేకాదు త్రిష, ప్రభాస్ కూడా ప్రేమించుకున్నారని..కొన్ని కారణాలతో విడిపోయారని అంటుంటారు. అయితే ఇప్పుడు ప్రభాస్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పుడు కూడా ప్రభాస్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ పెళ్లి ఖరారు అయ్యిందని..అయితే ప్రభాస్ ను చేసుకోబోయే అమ్మాయి హీరోయిన్ కాదని..ఇండస్ట్రీకి సంబంధం లేదని తెలుస్తోంది.
ప్రభాస్ వివాహం చేసుకోబోయే అయ్మాయి వారి చుట్టాల అమ్మాయే అని సమాచారం. ఆ అమ్మాయికి భారీగా ఆస్తులు ఉన్నాయని ఇండస్ట్రీలో వినిపిస్తున్నా గాసిప్. నిజంగానే ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారా. నిజంగానే ఇంట్లో వాళ్లు చూపించిన అమ్మాయిని చేసుకుంటున్నాడా అనే విషయాలు తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.
నోట్: ఈ ఆర్టికల్ కేవలం ఇంటర్నెట్ లో వస్తున్నా గాసిప్ ఆధారంగా రాసినది గమనించగలరు