పేరుకే పడిపోతున్న జనాలు.. అందరి నోటా మహీంద్రా థార్‌.. ఊహించని రేంజ్‌లో పెరిగిన సేల్స్

www.mannamweb.com


ఇండియాలో అత్యంత డిమాండ్ ఉన్న మోడల్‌గా మహీంద్రా థార్‌కు(mahindra thar) మంచి పేరుంది. ఈ మోడల్ లాంచ్ అయిన అనతికాలంలోనే చాలా మంది వినియోగదారులకు చేరువ అయింది.

కార్లను కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి థార్‌ గురించి తెలుసు. ఈ కారుతో రోడ్డుపై వెళ్తుంటే ఆ రాజసమే వేరు. దీని డిజైన్‌కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. దేశీయంగా ఈ మోడల్‌ చాలా నగరాలు, పట్టణాల్లో కనిపిస్తుంది. ఆఫ్ రోడ్ ప్రయాణాలకు మహీంద్రా థార్‌ బెస్ట్. ఈ ఎస్‌యూవీ లాంచ్ అయిన కొద్ది రోజుల్లోనే రికార్డు స్థాయిలో అమ్మకాలను నమోదు చేసి ఇతర మోడళ్ల కంటే కూడా అత్యంత డిమాండ్ ఉన్న వాహనంగా నిలిచింది. థార్ మొదట 3 డోర్ వెర్షన్‌లో విడుదల అయింది. కేవలం ఏడాది కాలంలోనే ఎక్కువ సేల్స్‌ను నమోదు చేయగా, తాజాగా థార్ ఎస్‌యూవీ ప్రతినెలా అమ్మకాల్లో దూసుకుపోతుంది.

ఇటీవల కంపెనీ నుంచి విడుదలైన డేటా ప్రకారం, నవంబర్ నెలలో థార్‌ మెరుగైన విక్రయాలను సాధించింది. ఇది ఇటీవలి నెలలో 8,708 యూనిట్ల విక్రయాలను నమోదు చేయగా, గత ఏడాది (2023) నవంబర్‌లో 5,810 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసింది. ఏడాది ప్రాతిపదికన చూసినట్లయితే దాదాపు 50 శాతం వృద్ధి. 3 డోర్ థార్‌తో పాటు, ఇటీవల విడుదలైన 5 డోర్ థార్ రాక్స్ సైతం మంచి అమ్మకాలను సాధించింది.

5 డోర్ థార్ రాక్స్ ఎస్‌యూవీ మార్కెట్లోకి విడుదలైన ఒక గంటలోనే 1.76 లక్షలకు పైగా బుకింగ్‌లను సాధించి రికార్డును క్రియేట్ చేసింది. 3 డోర్ థార్ వినియోగదారులను ఆకట్టుకోవడంతో దీనికి వచ్చిన ఆదరణ దృష్ట్యా రాక్స్‌ను మహీంద్రా తీసుకువచ్చింది. నవంబర్ నెలలో థార్‌ మెరుగైన నమోదు చేయడానికి రాక్స్‌ కూడా బాగా సహయపడింది. మహీంద్రా థార్ 2020 అక్టోబర్ 4 న ఇండియా మార్కెట్లోకి విడుదల అయింది.

దీని ధర రూ. 11.35 లక్షల నుండి రూ. 17.60 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. ఇది టర్బోచార్జ్డ్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ ఎస్‌యూవీలో చాలా అధునాతన ఫీచర్లు ఉన్నాయి. లోపల 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, మల్టీ కలర్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, రూఫ్ మౌంటెడ్ ఆడియో స్పీకర్లు, స్టీరింగ్ మౌంట్ కంట్రోల్‌ వంటివి ఉన్నాయి.

మహీంద్రా కంపెనీ తన ప్రయాణికుల సేఫ్టీ కోసం డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS సిస్టం, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్, హిల్ స్టార్ట్ అసిస్ట్‌ వంటివి ఉన్నాయి. థార్‌కు డిమాండ్ ఎక్కువగా ఉన్న కారణంగా వినియోగదారులకు సరైన సమయంలో డెలివరీ చేయడానికి తన ఉత్పత్తిని సైతం వేగవంతం చేసింది. 2024లో మెరుగైన అమ్మకాలను సాధిస్తున్న థార్, కొత్త ఏడాదిలో కూడా వినియోగదారులను మరింత ఆకట్టుకునే అవకాశం ఉంది.

అదే 5 డోర్ థార్ రాక్స్ ఎస్‌యూవీ పెట్రోల్‌, డీజిల్‌ రెండు వేరియంట్లలో లభిస్తుంది. దీనిలో అధునాతన ఫీచర్లు ఉన్నాయి. లోపల వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టం, యాపిల్‌ కార్‌ప్లే, ఆండ్రాయిడ్‌ ఆటో, రూఫ్ మౌంటెడ్ ఆడియో స్పీకర్లు వంటివి ఉన్నాయి. భద్రత కోసం ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABSను అందించారు.

థార్ రాక్స్ ఎస్‌యూవీ ధర రూ.12.99 లక్షల నుంచి రూ.22.49 లక్షల వరకు ఉంటుంది. దీని డిజైన్‌ ఆకర్షణీయంగా ఉంటుంది. 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్‌ 175 bhp పవర్‌ను, 370 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కు 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ సెటప్ ఉంటుంది. పెట్రోల్, డీజిల్ రెండు వేరియంట్లు కూడా మెరుగైన మైలేజ్‌ను ఇస్తాయి.