ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ బైక్ బజాజ్ ఫ్రీడమ్ 125 ధర తగ్గింది. ఈ బైక్ 2024 జూలై 5న మార్కెట్‌లో విడుదలైంది. దీనిని ముందుగా మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో బజాజ్ ఆటో విక్రయిచింది.
ఆ తర్వాత క్రమంగా బజాజ్ ఫ్రీడమ్ బైక్ సేల్స్ దేశమంతటా ప్రారంభం అయ్యాయి. ఈ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీతో పాటు పెట్రోల్ తోనూ పనిచేస్తుంది. అందువల్ల తక్కువ కాలంలోనే ఈ బైక్ అత్యంత ప్రజాధరణను పొందింది. తాజాగా ఈ బైక్ ధర తగ్గింది. ఎంత తగ్గింది. ఈ తగ్గింపు ధర ఎన్ని రోజులు అందుబాటులో ఉంటుందనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం..
భారత్‌లో సీఎన్‌జీ కార్లు జోరుగా అమ్ముడవుతున్నాయి. సాంప్రదాయ పెట్రోల్, డీజీల్‌తో పోలిస్తే ఈ ఇంధనం ధర తక్కువ. అంతే కాకుండా సీఎన్‌జీ కార్లు ఎక్కువ మైలేజీని అందిస్తాయి. దీంతో ఈ సెగ్మెంట్ కార్లను కొనేందుకు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. సీఎన్‌జీ కార్ల అమ్మకాల్లో మారుతి, హ్యుందాయ్, టాటా మోటార్స్ వంటి కంపెనీలు ముందంజలో ఉన్నాయి. ఇదే కోవాలో సీఎన్‌జీ బైక్స్‌కి కూడా దేశంలో ఆదరణ పెరిగే అవకాశం ఉంది.
అందులో భాగంగానే బజాజ్ ఆటో తీసుకువచ్చిన ఫ్రీడమ్ 125 మోటార్‌సైకిల్ బైక్‌ని కూడా ప్రజలు ఆదరిస్తున్నారు. నవంబర్‌లో విక్రయించిన ఫ్రీడమ్ 125 మోటార్‌సైకిళ్ల డేటాను బజాజ్ ఇంకా వెల్లడించలేదు. అయితే అక్టోబర్ 2024 లో మాత్రం 8013 బైక్స్ సేల్ అయ్యాయి. ప్రతీ నెలలో సేల్స్‌ని పెంచుకుంటూ వెళ్తోంది. ఇప్పటి వరకు అనధికారికంగా దాదాపు 60 వేలకు పైగా యూనిట్లు సేల్ అయ్యాని తెలుస్తోంది.
ఈ బజాజ్ బైక్ డ్రమ్, డ్రమ్ ఎల్‌ఈడీ, డిస్క్ ఎల్‌ఈడీ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఈ బైక్‌ని మరింత మంది కస్టమర్లకు అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో ఎంట్రీ లెవల్ వేరియంట్‌పై రూ.5 వేలు, మిడ్ వేరియంట్ ధర రూ.10 వేలు తగ్గించారు. దీంతో ఫ్రీడమ్ 125 ప్రారంభ ధర రూ.89,997కు తగ్గింది. మిడ్ వేరియంట్ ధర రూ.95,000కు తగ్గింది.
ఇక సీఎన్‌జీ బైక్ టాప్ వేరియంట్ ధరలో ఎటువంటి మార్పులు చేయలేదు. ఇది రూ.1.10 లక్షల ధరతో అందుబాటులో ఉంటుంది. పైన తెలిపిన ధరలన్నీ ఎక్స్‌షోరూమ్ ధరలు. అయితే బైక్ లాంచ్ అయిన 5 నెలల్లోనే ధరను తగ్గించడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ ధరల తగ్గింపు కారణంగా బైకుల్లో ఎటువంటి మార్పులు, తొలగింపులు చేయలేదు. కేవలం జనాలను సీఎన్‌జీ వైపు చూసేలా ధర తగ్గించినట్లు తెలుస్తోంది.
ఈ బైక్ సీఎన్‌జీ మోడ్‌లో 102 కిమీ, పెట్రోల్ వెర్షన్‌లో 65 కి.మీ మైలేజీని ఇస్తుంది. రెండు ఫ్యూయెల్స్ కలిపి 330 కి.మీ మైలేజీని అందిస్తుందని కంపెనీ క్లైయిమ్ చేసింది. రియల్ వరల్డ్‌లో మాత్రమే 280 కి.మీ మైలేజీ ఇస్తుంది. రోజువారి అవసరాల కోసం ఈ బైక్ సరిపోతుంది. ప్రస్తుతానికి ఈ బైక్‌కి ఇతర పోటీ మోటార్‌సైకిల్స్ లేవు.
అయితే దీని ఇంజిన్ టార్క్ పవర్‌తో పోల్చితే ఇది టీవీఎస్ రేడియన్, హీరో ఎక్స్‌ట్రీమ్ 125R, టీవీఎస్ రైడర్ 125 వంటి వాటికి గట్టి పోటీనిస్తుంది. ఇక ఈ బైక్‌ని 11 రకాల సేఫ్టీ టెస్టింగ్‌లను నిర్వహించారు. కావున దీనిని ధైర్యంగా కొనుగోలు చేయవచ్చు. టాప్ క్లాస్ స్మార్ట్ ఫీచర్లు, క్లాసీ డిజైన్‌తో ఈ బైక్‌ని తీసుకువచ్చారు. సింగిల్ స్విఛ్‌తో పెట్రోల్ లేదా సీఎన్‌జీ మోడ్‌లోకి క్షణాల్లో మారిపోవచ్చు.
ఇక ఈ బైక్‌పై ధర తగ్గింపు ఆఫర్ ఎప్పటి వరకు కొనసాగుతుందనే విషయాన్ని బజాజ్ ఆటో వెళ్లడించలేదు. అయితే ఈ తగ్గింపుని కొందరు ఇయర్ ఎండ్ ఆఫర్‌గా అభివర్ణిస్తున్నారు. ఒకవేళ భారీ రెస్పాన్స్ వస్తే మళ్లీ ధరలు పెంపు చేసే అవకాశం ఉంటుంది. కావున ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ బైక్‌లో రైడ్‌ని ఎంజాయ్ చేయాలనుకుంటే ఇప్పుడే బజాజ్ షోరూమ్‌ని సందర్శించండి.