ఇలా చేస్తే చాలు 40 లో కూడా 20 ఏళ్ల యంగ్ లుక్,ముడతలు లేకుండా మెరిసిపోతారు

www.mannamweb.com


ఈ రోజుల్లో 40 ఏళ్ళు వచ్చేసరికి ముఖం మీద ముడతలు వచ్చి వయస్సు బాగా ఎక్కువ ఉన్నవారిలా కనిపిస్తున్నారు. అలా కాకుండా 40 లో కూడా 20 ఏళ్ల యంగ్ లుక్ రావాలంటే ఇప్పుడు చెప్పే చిట్కా చాలా బాగా సహాయపడుతుంది.

ప్రతి రోజు 4 బాదం పప్పులను తినాలి. బాదం పప్పును రాత్రి సమయంలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తొక్క తీసేసి తినాలి

బాదం పప్పు ను సూపర్ ఫుడ్ గా పోషకాహార నిపుణులు చెప్పుతు ఉంటారు. బాదం పప్పులో ఉన్న పోషకాలు చర్మ ఆరోగ్యానికి చాలా బాగా సహాయపడతాయి. బాదంపప్పులో యాంటీ ఆక్సిడెంట్స్,విటమిన్ E వంటి 15 రకాల పోషకాలు ఉంటాయి. బాదం పప్పులో విటమిన్ E సమృద్దిగా ఉండుట వలన ముడతలను తగ్గిస్తుంది.

అలాగే వృదాప్య లక్షణాలను ఆలస్యం చేస్తుంది. బాదంపప్పును ఎక్స్‌ఫోలియేటర్‌గా ఉపయోగించవచ్చు, ఇది చర్మంలో మలినాలను మరియు మృత కణాలను తొలగిస్తుంది . ఇది చర్మ కణాలను పునరుత్పత్తి చేస్తుంది , తద్వారా చర్మం కాంతివంతంగా మారుతుంది. నల్లని వలయాలను తొలగిస్తుంది. బాదంపప్పులో ఉండే లినోలిక్ యాసిడ్ చర్మం పొడిగా లేకుండా తేమగా ఉండేలా చేస్తుంది.

ఒక బౌల్ లో ఒక స్పూన్ బాదం పొడి,అరస్పూన్ తేనె,అరస్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ పాలు పోసి బాగా కలిపి ముఖానికి రాసి పది నిమిషాలు అయ్యాక ముఖాన్ని శుభ్రం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే సరిపోతుంది. వారంలో రెండు సార్లు ఈ ప్యాక్ వేసుకుంటూ…రోజుకి 4 బాదం పప్పులను తింటే 40 లో కూడా 20 ఏళ్ల యంగ్ లుక్,ముడతలు లేకుండా మెరిసిపోతారు.

ఈ చిట్కాలో ఉపయోగించిన బాదం పప్పు,తేనే,నిమ్మరసం,పాలు.. వీటిలో ఉన్న పోషకాలు అన్నీ ముఖ సంరక్షణలో చాలా బాగా సహాయపడతాయి. చర్మానికి పోషణ ఇవ్వటమే కాకుండా చర్మం మీద మృత కణాలను తొలగించి ముఖం తెల్లగా మెరిసేలా కాంతివంతంగా చేస్తుంది. కాబట్టి ఈ చిట్కాను ఫాలో అయితే చాలా తక్కువ ఖర్చులో మంచి పలితాన్ని పొందవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.