తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అదానీ(adani) రేవంత్ దోస్తీపై నిరసన తెలుపుతూ..
బీఆర్ఎన్ (brs) ఎమ్మెల్యేలు (mlas) తమ టీ షర్టులపై ప్రింట్ వేసుకున్నారు. ఈ క్రమంలో గన్ పార్క్ నుంచి అసెంబ్లీలోకి బయలుదేరాను.. గేట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. టీ షర్ట్ ఉంటే అసెంబ్లీలోకి అనుమతించమని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తెలిపారు.
దీంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీ గేటు ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మొదట కోరుట్ల ఎమ్మెల్యే డా. సంజయ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆ తర్వాత ఒక్కొక్కరిగా కేటీఆర్(KTR) సహా అందరిని అరెస్ట్(arrest) చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు పోలీసులు, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా అసెంబ్లీ గేట్ ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.ఇదిలా ఉంటే తెలంగాణ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ లీడర్లు లేకుండానే ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశాల ప్రారంభంలో భాగంగా స్పీకర్(Speaker) అనుమతితో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు ఆవస్యకతను వివరించారు.