టీ, కాఫీ ఎక్కువగా తాగితే దంతాలపై ప్రభావం పడుతుంది. ఇవి నేరుగా దంతాలకు తాకడం వల్ల ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. టీ, కాఫీ అతిగా తాగితే దంతాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే..
టీనో, కాఫీనో తాగనిదే చాలా మందికి రోజు మొదలవదు. దేశంలో 60 శాతానికి పైగా జనాలు టీ, కాఫీలు రెగ్యులర్‌గా తాగుతున్నారు. ఉదయాన్నే ఇవి శరీరానికి ఉత్తేజాన్ని, శక్తిని ఇస్తాయి. అయితే, ఓ పరిమితి మేర వీటిని తాగితే ఏ సమస్య ఉండదు. అయితే, టీ లేదా కాఫీ మోతాదుకు మించి అతిగా తీసుకుంటే కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయి. దంతాలపై కూడా ఎఫెక్ట్ ఉంటుంది.
టీ, కాఫీల్లో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. దీని మోతాదు ఎక్కువైతే దంతాలకు చెడు ప్రభావం కలుగుతుంది. అలాగే వీటిల్లోని కొన్నింటి వల్ల పళ్లకు ఇబ్బందిగా మారుతుంది. అవేవో ఇక్కడ తెలుసుకోండి.
దంతాల ఎనామెల్‌కు దెబ్బ
టీ, కాఫీల్లో ఉండే కెఫిన్లో టాన్నిన్స్ ఉంటుంది. ఇది దంతాల ఎనామెల్‌ను దెబ్బతీస్తుంది. దీంతో దంతాలు సెన్సిటివ్‌గా అవుతాయి. బ్యాక్టీరియా పెరిగేందుకు టాన్నిన్స్ కారణం అవుతుంది. దంతాలపై గార పేరుకుపోయేలా చేస్తుంది. దీనివల్ల చిగుళ్ల నొప్పి సహా మరిన్ని దంతాల సమస్యలు వస్తాయి.
చెడు శ్వాస
టీ, కాఫీ ఎక్కువగా తాగితే నీటి నుంచి చెడు శ్వాస ఎక్కువుతుంది. బ్యాక్టీరియా పెరగడమే ఇందుకు కారణంగా మారుతుంది. నోటి శుభ్రత తగ్గుతుంది. దంతాలకు ఇబ్బందిగా మారుతుంది.
పంటి నొప్పి పెరుగుతుంది
టీ, కాఫీ కూడా దంతాల నొప్పికి ఒక్కోసారి కారణంగా అవుతాయి. కెఫిన్ ఎక్కువైతే నొప్పి వస్తుంది. కాఫీ, టీలో అసిడిక్ ఉంటుంది. ఇది ఎక్కువైతే దంతాల ఎనామెల్ మృధువుగా మారుతుంది. ఇది ఎక్కువగా దెబ్బ తింటే పళ్లు విరిగిపోయే రిస్క్ కూడా ఉంటుంది. దంతాలు బలహీనపడి నొప్పి ఎక్కువ కావొచ్చు.
పచ్చగా మారడం
దంతాలకు నేరుగా కఫీన్ ఎక్కువగా తగిలితే గారపట్టి పసుపు పచ్చగా మారే అవకాశం ఉంటుంది. కెఫిన్లోని క్రోమోజెన్ ఇందుకు కారణం అవుతుంది. ఇదే కాఫీకి డార్క్ కలర్ ఇస్తుంది. కాఫీ, టీ తాగినప్పుడు టానిమ్కు క్రోమోజెన్ తోడై పళ్లకు ఎక్కువగా గారపట్టేస్తుంది.
పళ్లు పుచ్చే రిస్క్
కాఫీ, టీలో ఉండే కారకాలు.. దంతాలపై మరకలు సులువగా చేరుస్తాయి. దీంతో ఎనామెల్ పల్చగా అవుతుంది. పళ్లకు డ్యామేజ్ జరగుతుంది. దీనివల్ల పళ్లు పుచ్చిపోయే రిస్క్ కూడా ఉంటుంది.
కాల్షియం శోషణకు ఇబ్బందే..
టీ, కాఫీ ఎక్కువగా తాగితే పళ్లు కాల్షియాన్ని కూడా సరిగా శోషించుకోలేవు. దీనివల్ల దంతాల దృఢత్వం తగ్గే అవకాశం ఉంటుంది. ఇది పళ్లపై దుష్ప్రభావం చూపుతుంది.
ఎంత తీసుకోవచ్చు
ప్రతీ రోజు కాఫీ, టీ తాగడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. అయితే, పరిమిత మేరకే తీసుకోవాలి. రోజులో సుమారు రెండు నుంచి మూడు కప్‌ల టీ లేదా కాఫీ తీసుకోవచ్చు. ఈ మోతుదులో ఉంటే పెద్దగా చెడు ప్రభావాలు ఉండవు. అదే ఇంతకు మించి అతిగా తాగితే రిస్క్‌లు ఎదురుకావొచ్చు.
ఒకవేళ దంతాల్లో ఎవైనా ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే సంబంధిత వైద్య నిపుణులను సంప్రదించాలి. నిర్లక్ష్యం వహిస్తే సమస్య వేగంగా విస్తరిస్తుంది. పెద్ద ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది. అందుకే దంతాలకు ఏదైనా ఇబ్బందిగా ఉంటే చెకప్ చేయించుకోవడం మేలు.