మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఎన్నో రకాల మత ఆచారాలను విశ్వసిస్తూ ఉంటాము. ఇక ఏ చిన్న పాటి జబ్బు వచ్చినా కూడా కొన్ని పూజలు పరిహారాలు చేయిస్తూ ఉంటాము అయితే కొన్ని మొండి రోగాలు హాస్పిటల్ కి వెళ్లిన తగ్గవు కానీ కొన్ని ఆలయాలకు వెళ్తే మాత్రం తగ్గుతూ ఉంటాయి ఇలాంటి వాటిని మన హిందువులు ఎంతోగానో నమ్ముతూ ఉంటారు.
ఇలా ఎంత మొండి రోగాలతోనైనా బాధపడేవారు ఈ ఆలయానికి వెళ్తే నయం అవుతుందని తెలుస్తోంది. మరి ఆ ఆలయం ఏంటి ఎక్కడ ఉందనే విషయానికి వస్తే…
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన నంజుండేశ్వర క్షేత్రం కర్ణాటకలోని మైసూరుకు దగ్గరలో ఉన్న నంజున్గఢ్ జిల్లాలో ఉంది. ఇక్కడి శివుడిని శ్రీకంఠీశ్వరుడు అని పిలుస్తారు. ఈ ఆలయంలోని శివలింగం గౌతమ మహర్షి ప్రతిష్టించినట్టుగా ఈ ఆలయ శిలాఫలకాలు చూస్తే అర్థమవుతుంది. కన్నడ భాషలో నంజ అంటే విషం, నంజుంద అంటే విషాన్ని స్వీకరించిన వాడు అనే అర్థం వస్తుంది. అందుకే ఇక్కడ ఉన్నటువంటి శివుడిని నంజుండేశ్వరుడు అని పిలుస్తారు.
మన పురాణాల ప్రకారం సాగర మధనం చేస్తున్న సమయంలో సముద్ర గర్భం నుంచి విషం రావడం ఆ విషాన్ని శివుడు తాగి గొంతులోనే నిల్వ చేయడంతో ఆయన కంఠం నీలంగా మారుతుంది అందుకే శివుడిని నీలకంఠేశ్వరుడు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక ఈ ఆలయంలో శివుడిని కనుక దర్శించుకున్నట్లయితే ఎలాంటి రోగాలైనా తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.
ఈ ఆలయానికి సమీపంలో ఉన్న కపిల నదిలో స్నానం చేసి వచ్చి నంజున్ దేశ్వరునికి ఉరుల్ అనే సేవ చేస్తే రోగాలన్నీ నయం అవుతాయని నమ్మకం. అందుకే పెద్ద ఎత్తున భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు ప్రతి సోమవారం భారీ స్థాయిలో భక్తులు ఇక్కడకు చేరుకొని శివుడిని ప్రత్యేక పూజలతో పూజిస్తూ ఉంటారు. ఇక కార్తీక మాఘ మాసాలలో ఈ ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు.