ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఇది శుభవార్త. భారత టెలికమ్యూనికేషన్స్ విభాగంలోని ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది.
ఎలాంటి పరీక్ష లేకుండానే ఇందులో ఉద్యోగం పొందవచ్చు. ఎలా అప్లై చేయాలి అంటే..?
ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఇది శుభవార్త. భారత టెలికమ్యూనికేషన్స్ విభాగంలోని ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఎలాంటి పరీక్ష లేకుండానే ఇందులో ఉద్యోగం పొందవచ్చు. ఈ ప్రభుత్వ ఉద్యోగాని మీరు ఎంపికైతే మీ జీవితం సెట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి నెలా రూ.47600 నుంచి రూ.151100 వరకు జీతం వస్తుంది. అయితే సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ ఉండాలనే షరతు ఉంది.
టెలికమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్ రిక్రూట్‌మెంట్ 2024: భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్‌లో ఈ ఉద్యోగాలకు ఇటీవల నోటిఫికేషన్ వచ్చింది. ఈ శాఖ TES గ్రూప్ B కింద సబ్ డివిజనల్ ఇంజనీర్ (SDE) పోస్టుల కోసం ఖాళీలను ప్రకటించింది. మీరు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ https://dot.gov.in/ వెబ్‌సైట్‌ని సందర్శించండి. ఈ పోస్టులకు డిసెంబర్ 26 వరకు మాత్రమే దరఖాస్తులు చేసుకోవచ్చని గుర్తుంచుకోండి.
ఎన్ని పోస్టులు & ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి?
DOT ఉద్యోగాలు 2024: టెలికమ్యూనికేషన్స్ విభాగంలో మొత్తం 48 సబ్ డివిజనల్ ఇంజనీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో అత్యధికంగా 22 పోస్టులు న్యూఢిల్లీకి సంబంధించినవి. అదేవిధంగా, అహ్మదాబాద్, షిల్లాంగ్‌లో 3, కోల్‌కతా, ముంబైలో 4, జమ్మూ, మీరట్, నాగ్‌పూర్, సిమ్లాలో ఒక్కొక్కటి చొప్పున రెండు పోస్టులకు రిక్రూట్‌మెంట్ జరగనుంది. ఎర్నాకులం, గ్యాంగ్‌టక్, గౌహతి, సికింద్రాబాద్‌లో ఒక్కొక్క పోస్టు ఉంది.
అర్హత, వయో పరిమితి:
టెలికమ్యూనికేషన్స్ విభాగంలో సబ్ డివిజనల్ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండాలి. దరఖాస్తు చేసుకోవడానికి గరిష్ట వయస్సు 56 సంవత్సరాలు ఉండాలి. ఈ పోస్టులకు ఎంపిక ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.