టెన్త్ పరీక్షల షెడ్యూల్ ఖరారు – సంక్రాంతి సెలవుల్లో మార్పు.

www.mannamweb.com


ఏపీలో పదో తరగతి పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. ఇందుకు సంబంధించి విద్యా శాఖ తమ ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించింది. తొలుత మార్చి 15 నుంచి పరీక్షలు నిర్వహించేలా ఆలోచన జరిగింది.

అయితే, తాజాగా విద్యాశాఖ ప్రతిపాదనల మేరకు మార్చి 18 నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల షెడ్యూల్ ను ఖరారు చేసారు. ఇప్పటికే 100 రోజుల ప్రణాళిక అమలు చేస్తున్నారు. కాగా, టెన్త్ విద్యార్ధులకు సంక్రాంతి సెలవుల్లోనూ మార్పు చేసారు.

మార్చి 18 నుంచి ప్రారంభం

ఏపీలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను విద్యా శాఖ అధికారులు సిద్దం చేసారు. ఇప్పటికే పరీక్ష ఫీజు ప్రక్రియ మొదలైంది. తొలుత మార్చి 15 నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని భావించారు. కానీ, ఇప్పుడు తాజా షెడ్యూల్ మేరకు మార్చి 18 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పరీక్షల నిర్వహణ షెడ్యూల్ ను ప్రభుత్వ పరిశీలనకు పంపారు. తాజా ప్రతిపాదనల మేరకు మార్చి 18 నుంచి మార్చి 30వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన 100 రోజుల యాక్షన్ ప్లాన్ మార్చి 10 తో ముగియనుంది.

పరీక్షల షెడ్యూల్

దీంతో, మార్చి 18 నుంచి పరీక్షలు ప్రారంభించి.. నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ప్లాన్ చేసారు. అదే విధంగా పరీక్షా కేంద్రాల ఎంపిక పైన జిల్లా విద్యా శాఖ అధికారులకు మార్గదర్శకాలు తాజాగా జారీ అయ్యాయి. మార్చి 18న ఫస్ట్ లాంగ్వేజ్, 19న ద్వితీయ భాష, 20న ఇంగ్లీషు, మార్చి 22న గణితం, 23న ఫిజికల్ సైన్స్, 26న బయోలాజికల్ సైన్స్, 27న సామాజిక అధ్యయనాలు, 28న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ -2, మార్చి 30న మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -2 నిర్వహించాలని తాజాగా నిర్ణయించారు. ఈ మేరకు అధికారికంగా పరీక్షల షెడ్యూల్ ను ప్రకటించనున్నారు. ఇప్పటికే పదో తరగతి విద్యార్ధుల కోసం వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక అమల్లోకి వచ్చింది.

సంక్రాంతి సెలవులు

ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రణాళికలో భాగంగా ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి సాయం త్రం 5 గంటల వరకు ఆరు సెషన్లలో పదో తరగతి విద్యార్ధులకు తరగతులు నిర్వహిస్తున్నారు.ఈ ప్రణాళికలో సూచించినట్టు ఆదివారం కూడా నిర్ణీత సబ్జెక్టులు బోధించాలని నిర్దేశించారు. పదో తరగతి విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్ధ, అదనపు తరగతులను నిర్వహిస్తున్నారు. సంక్రాంతికి పదో తరగతి విద్యార్ధులకు మూడు రోజులకే పరిమితం చేసారు. అందులో భాగంగా జనవరి 13, 14, 15 తేదీలు (సంక్రాంతి సెలవులు) మినహా అన్నిరోజులూ అదనపు తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ పేర్కొంది. పదో తరగతి విద్యార్థులకు ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి సాయం త్రం 5 గంటల వరకు ఆరు సెషన్లలో తరగతులు నిర్వహించనున్నారు.