పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. 2025 జనవరి నుంచి ఏటీఎం నుంచే పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవచ్చు

www.mannamweb.com


ప్రముఖ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) సంస్థలోని 7 కోట్ల మంది సభ్యులకు పెద్ద శుభవార్త చెప్పింది. ఈపీఎఫ్ కింద ఏటీఎం నుంచి పీఎఫ్ విత్‌డ్రా చేసుకునే సదుపాయంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని కొంతకాలం క్రితమే వార్తలు వచ్చాయి.

ఇప్పుడు దీనికి సంబంధించి ఓ పెద్ద ప్రకటన వెలువడింది.

కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ప్రస్తుతం భారత శ్రామికశక్తికి మెరుగైన సేవలందించేందుకు ఐటి వ్యవస్థలను మెరుగుపరిచే ప్రక్రియలో ఉందని కార్మిక కార్యదర్శి సుమితా దావ్రా ప్రకటించారు. ఈపీఎఫ్ఓ సభ్యులు వచ్చే సంవత్సరం అంటే.. 2025 నుంచి ఏటీఎం ద్వారా పీఎఫ్ డబ్బును విత్‌డ్రా చేసుకునే సదుపాయాన్ని పొందబోతున్నారని ఆయన అన్నారు.

కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుమిత్రా దావ్రా మాట్లాడుతూ.. “మేం మా పీఎఫ్ కేటాయింపు ఐటీ వ్యవస్థను మరింత మెరుగుపరుస్తున్నాం. ఇంతకుముందు కూడా అనేక మార్పులు చూశాం. వేగంగా క్లెయిమ్‌లు, ఆటో-క్లెయిమ్‌లు పెరిగాయి.

ఈపీఎఫ్‌వో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీపై పనిచేస్తోందని, పీఎఫ్‌ కింద అనవసరమైన ప్రక్రియలను తొలగించామన్నారు. మా బ్యాంకింగ్ వ్యవస్థతో సమానంగా ఈపీఎఫ్ఓ ఐటీ మౌలిక సదుపాయాలను తీసుకురావడమే మా ఆశయం. మేం ఈపీఎఫ్ఓలో ఐటీ 2.1 వెర్షన్‌తో జనవరి 2025లో భారీ మార్పులను చూస్తారు.

క్లెయిమ్‌లు, లబ్ధిదారులు లేదా బీమా చేసిన వ్యక్తులు నేరుగా ఏటీఎం ద్వారా క్లెయిమ్‌లను విత్‌డ్రా చేసుకోవచ్చు”అని దావ్రా పేర్కొన్నారు. ప్రభుత్వ ఈపీఎఫ్ఓ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌కు యాక్టివ్ కంట్రిబ్యూటర్‌ల సంఖ్య 7 కోట్ల కన్నా ఎక్కువ. ఈపీఎఫ్ఓ సేవలను మరింత మెరుగుపరచేందుకు పీఎఫ్ విత్‌డ్రా కోసం కొత్త కార్డును జారీ చేస్తుంది. తద్వారా ఏటీఎంల ద్వారా సులభంగా విత్‌డ్రా చేయవచ్చు. అయితే, డిపాజిట్ చేసిన మొత్తంపై 50శాతం విత్‌డ్రా పరిమితి మాత్రమే ఉంటుంది.

ఈపీఎఫ్ఓ విత్‌డ్రా నియమాలు :
ఉద్యోగంలో ఉన్నప్పుడు మీరు పీఎఫ్ నిధులను పాక్షికంగా లేదా పూర్తిగా విత్‌డ్రా చేసేందుకు అనుమతించరు. మీరు కనీసం ఒక నెలపాటు నిరుద్యోగిగా ఉంటే.. మీ పీఎఫ్ బ్యాలెన్స్‌లో 75శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. రెండు నెలల నిరుద్యోగం తర్వాత, మీరు పూర్తి మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవడానికి అర్హులు.