ఇవన్నీ శరీరంలో రక్తం తక్కువగా ఉంటే కనిపించే లక్షణాలే, కానీ ఎవరికి తెలియదు

www.mannamweb.com


శరీరంలో రక్తం ముఖ్యమైనది. రక్తం తగ్గితే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే శరీరంలో తక్కువంటే జాగ్రత్తగా ఉండమని వైద్యులు. ఎర్ర రక్తకణాలు తగినంత హిమోగ్లోబిన్ ఉత్పత్తి చేయకపోతే రక్తం ఉత్పత్తి తగ్గిపోతుంది.

హిమోగ్లోబిన్శరీరంలో ఆక్సిజన్ సరఫరాకు అవసరం. రక్తహీనత రావడానికి ముఖ్యకారణం శరీరంలో ఇనుము లోపించడం. హిమోగ్లోబిన్ తయారీకి ఐరన్ అవసరం. రక్తహీనతను అనీమియా అంటారు.

శరీరంలో రక్తం లేనప్పుడు అనేక రకాల లక్షణాలు కనిపిస్తాయి. అలసట, నీరసంతో పాటు కొన్ని రకాల లక్షణాలు ఉంటాయి. అయితే వీటిని ఎవరూ పెద్దగా పట్టించుకోరు . ఇవి పెద్దవారిలోనే కాదు పిల్లల్లో కూడా కనిపిస్తాయి. పిల్లలు లేదా పెద్దలలో ఈ లక్షణాలు కనిపిస్తే, రక్తాన్ని ఉత్పత్తి చేసే ఆహారాన్ని తినండి. రక్త హీనత సమస్యల మీలో ఉంటే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.

పిల్లల్లో కనిపించే లక్షణాలు

పిల్లలు సున్నం, సుద్ద ముక్కలు వంటివి తింటూ ఉంటే వారిలో ఐరన్ లోపం ఉందని అర్థం చేసుకోవాలి. దీని వల్ల వారికి రక్తహీనత సమస్య ఉన్నట్టు లెక్క. ఇక పెద్దలో మాంసాహారం అధికంగా తినాలనిపిస్తే వారిలో రక్తం తక్కువగా ఉన్నట్టు గుర్తించాలి. ఇనుము లోపం వల్లే రక్తం ఉత్పత్తి చాలా వరకు తగ్గిపోతుంది.

రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్

కొంతమందిలో రెస్ట్ లెస్ లెగ్ సిండ్రోమ్ ఉంటుంది. దీని వల్ల కాళ్ళను కదిలిస్తూనే ఉంటారు. రాత్రిపూట ఈ సమస్య వల్ల నిద్ర సరిగా పట్టదు. అలాంటి వారు తరచూ కాలు నొప్పిగా ఉందని చెబుతూ ఉంటారు. రెస్ట్ లెస్ లెగ్ సిండ్రోమ్ ఉన్న వారిలో తక్కువ ఇనుము స్థాయిలు ఉంటాయి. ఇది రక్త హీనతను సూచిస్తుంది.

జుట్టు రాలడం

జుట్టు ఎక్కువగా రాలిపోవడం కూడా రక్త హీనత సమస్యను సూచిస్తుంది. వెంట్రుకలు బలహీనంగా మారి విచ్ఛిన్నం కావడం శరీరంలో ఐరన్ లోపం ఉందని సూచించే లక్షణాలు. సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద కూడా చల్లగా అనిపిస్తే శరీరంలో ఇనుము లోపం ఉందని అర్థం చేసుకోండి. మీకు ఇలాంటి లక్షణం కనిపిస్తే వెంటనే ఇనుము పరీక్ష చేయించుకోండి.

ఇనుము లోపం ఉన్నప్పుడు, ఇనుము అధికంగా ఉండే ఆహారాన్ని ఎంపిక చేసుకుని ఎక్కువగా తినడం మంచిది. కానీ ఐరన్ అధికంగా ఉండే ఆహారాలతో పాటు విటమిన్ ఇ ఉన్న ఆహారాలు కూడా తినడం చాలా ముఖ్యం.

మీరు ఇనుము లోపాన్ని తీర్చుకోవాలంటే ప్రత్యేకమైన ఆహారంలో పాటూ విటమిన్ సి సప్లిమెంట్స్ తినడం చాలా ముఖ్యం. దీని వల్ల విటమిన్ సి శరీరంలో ఐరన్ శోషణను పెంచుతుంది. బ్రోకలీ, ఎండు ద్రాక్షలు, నట్స్, ప్రూన్, పచ్చి బఠానీలు, తృణధాన్యాలు, పుచ్చకాయ, చికెన్, గుడ్లు, రొయ్యలు, ఆప్రికాట్ వంటివి తింటూ ఉండాలి.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)