మోహన్‌బాబుకు మరో బిగ్ షాక్.. హత్యాయత్నం కేసు నమోదు

www.mannamweb.com


జర్నలిస్ట్‌పై దాడి కేసులో నటుడు మోహన్ బాబుకు మరో బిగ్ షాక్ తగిలింది. ఈ మేరకు తాజాగా ఆయనపై BNS 109 సెక్షన్ కింద పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

అయితే, బుధవారం మోహన్ బాబుపై 118 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు లీగల్ ఒపీనియన్ తీసుకుని సెక్షన్‌ను మార్చారు. కాగా, హైదరాబాద్‌లోని జల్‌పల్లి (Jalpally)లో మోహన్ బాబు(Mohan Babu) నివాసం వద్ద మంగళవారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంట్లోకి వెళ్లేందుకు మనోజ్, మౌనిక దంపతులు ప్రయత్నించగా సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. అనంతరం సెక్యూరిటీతో మనోజ్ (Manoj) వాగ్వాదానికి దిగి గేట్లు తోసుకుని మరీ లోపలికి వెళ్లారు.

ఈ క్రమంలోనే కవరేజీ కోసం లోనికి వెళ్లిన మీడియా ప్రతినిధులను మోహన్ బాబు దుర్భాషలాడుతూ.. ఓ జర్నలిస్టుపై అమానుషంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై తెలంగాణ జర్నలిస్ట్ సంఘాలు, రాజకీయ, సినీ ప్రముఖులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్ట్‌పై దాడి ఘటనలో మోహన్‌బాబుపై పహాడీ షరీఫ్ పోలీసులు 118 బీఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. కాగా, ప్రస్తుతం లీగల్ ఒపీనియన్ తీసుకుని తాజాగా ఆయనపై BNS 109 సెక్షన్ కింద హత్యాయత్న కేసు నమోదు చేశారు