తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకు పెన్షన్

www.mannamweb.com


ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీలో తల్లిదండ్రులు చనిపోయి చిన్నారులు ఉంటే వారికీ పెన్షన్ ఇవ్వాలని అధికారులకు సూచించారు. దివ్యాంగులు చాలా మంది 15 వేలు పెన్షన్ అడుగుతున్నారని…అందులో సదరం ధృవీకరణ పత్రాలను అర్హులకే దక్కేలా చూడాలని తెలిపారు.

ఇక అటు ఏపీలో 6 లక్షల ఫేక్‌ పెన్షన్లు ఉన్నట్లు చంద్రబాబు నాయుడు సర్కార్‌ గుర్తించినట్లు సమాచారం. రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్సు లో పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణపేదరిక నిర్మూలన శాఖలపై ప్రజెంటేషన్ ఇచ్చారు ఆ శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్. పెన్షన్ లు అర్హత లేనివారికి వస్తున్నాయనే పిర్యాదులు ఉన్నాయని వెల్లడించారు. నిర్వహించిన సర్వేలో ప్రతీ పదివేలకూ 500 మంది వరకూ అనర్హులని తేలినట్టు స్పష్టం చేశారు.

గత ప్రభుత్వ హయాంలో ఎన్నికలకు ముందు 6 లక్షల మందికి హడావుడిగా పెన్షన్లు ఇచ్చారని తెలిపారు. ఇందులో చాలా మంది అనర్హులే ఉన్నారని వ్యాఖ్యానించారు మంత్రి నాదెండ్ల మనోహర్. వచ్చే మూడు నెలల్లోగా ప్రతీ పెన్షన్ ను జిల్లా కలెక్టర్లు పరిశీలించాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు. మూడు నెలల్లోపల పోలియో, అంగవైకల్యం అంశాలపై ఒక రిపోర్టు సిద్ధం కావాలని… గోదావరి పుష్కరాలకు కావాల్సిన ప్లానింగ్ పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు.