ఈ విధంగా చేస్తే చాలు.. మీ సొంత ఇంటి కల నెరవేరడం ఖాయం.. ఏం చేయాలో తెలుసా?

www.mannamweb.com


సొంత ఇంటి కల నెరవేరాలి అంటే అందుకోసం కొన్ని రకాల పనులు చేయాలని చెబుతున్నారు. ప్రతి ఒక్కరికి జీవితంలో సొంత ఇంటి కల అన్నది తప్పనిసరిగా ఉంటుంది.

సొంతింటి కలను నెరవేర్చుకోడానికి ఎన్నెన్నో పనులు చేస్తూ ఉంటారు. యాగాలు, హోమాలు, దాన,ధర్మాలు పరిహారాలు పాటిస్తూ ఉంటారు. అయినా కూడా కొంతమందికి సొంత ఇంటి కల నెరవేరదు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? ఏం చేస్తే సొంత ఇంటి కల నెరవేరుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

సొంత ఇంటి కల నెరవేరాలి అనుకున్న వారు రావి చెట్టుకి పూజ చేయాలట. రావి చెట్టుకి 108 ప్రదక్షిణలు చేస్తే మంచి జరుగుతుందని చెబుతున్నారు. అయితే ప్రదక్షిణలు చేసేటప్పుడు ఎప్పుడు కూడా నెమ్మదిగా చేయాలట. అదేవిధంగా ఒక మంత్రాన్ని కూడా జపించాలని చెబుతున్నారు. ఇంతకీ ఆ మంత్రం ఏమిటంటే.. ” మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో.. విష్ణు రూపాయ అంత్యే శివరూపాయ.. వృక్షరాసాయతే నమో నమః ” అనే ఈ మంత్రాన్ని జపిస్తే త్వరగా గృహ యోగం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఈ విధంగా 108 రోజులపాటు 108 సార్లు ఈ మంత్రాన్ని జపిస్తూ రావి చెట్టుకి 108 ప్రదక్షిణలు చేయడం వల్ల చాలా మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. ఇలా చేసిన తర్వాత తప్పకుండా మీ సొంతింటి కల నెరవేరుతుంది అని చెబుతున్నారు.

మీ గుడిలో చిన్న ఇల్లు కట్టుకోండి. ప్రతి ఆదివారం అందులో ఆవనూనె దీపం వెలిగించండి. దీపం పూర్తిగా కాలిపోయాక అందులో కర్పూరాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వల్ల ఇంటి కొనుగోలులో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి.