రైతే దేశానికి వెన్నెముక అంటారు. అటువంటి రైతన్న ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఎంత విలవిలలాడుతున్నారు. పెట్టుబడులు పెగుతున్నాయి.
కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధరల లేక పండించిన పంట ఏంచేయసుకోవాలో తెలియక మరోసారి పంట వేయటానికి చేతిలో చిల్లిగవ్వలేక అల్లాడుతున్నాడు. ఈ సమస్యను పరిష్కరించడానికి, ప్రభుత్వం రైతులకు ట్రాక్టర్లను తక్కువ ధరలకు కొనుగోలు చేయడానికి సబ్సిడీ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం రైతులకు సబ్సిడీ ద్వారా ట్రాక్టర్లను కొనుగోలు చేయడానికి సహాయపడుతుంది.
Subsidy Tractors : ట్రాక్టర్ కొనాలని అనుకునే వారికి గుడ్ న్యూస్.. ఏకంగా రూ.3 లక్షల సబ్బిడి
Subsidy Tractors రైతులకి చాలా ఉపయోగం..
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ సబ్సిడీ పథకం ద్వారా రైతులు ట్రాక్టర్ కొనుగోలు చేసేటప్పుడు సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి, రైతులు అర్హత ప్రమాణాలను పూర్తి చేస్తే సరిపోతుంది. అయితే ఈ పథకం కోసం రైతులు ఏమి చేయాలంటే. ముందుగా ట్రాక్టర్ కొనుగోలు చేయాలి. వారు భారత పౌరులు అయి ఉండాలి. ఒక్కో రైతు ఒక ట్రాక్టర్ మాత్రమే కొనుగోలు చేయవచ్చు.అటువంటి అర్హతలు కలిగిన రైతులు సబ్సిడీని పొందేందుకు అర్హులుగా చెప్పవచ్చు. ఇక సబ్సిడీ పొందేందుకు రైతులు కొన్ని పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
ఆధార్ కార్డ్ కాపీ, బ్యాంక్ పాస్ బుక్, భూమి రికార్డులు, మొబైల్ నంబర్ ఆధార్ కార్డ్‌కి లింక్ చేయబడి ఉండాలి. ఇక రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం రాయితీ రుణాలు, వడ్డీలేని రుణాలు వంటి అనేక పథకాలను ప్రవేశపెట్టింది. ఈ పథకాలు రైతులకు ఎంతో సహాయాన్ని అందిస్తున్నాయి. రైతుల జీవితాలను మెరుగుపరచడానికి మరియు వారికి అవసరమైన పనిముట్లను అందించేందుకు వ్యవసాయ శాఖ అనేక పథకాలను ప్రారంభించింది. కర్ణాటకలోని రైతులు అర్హత ప్రమాణాలను పూర్తి చేయడం ద్వారా మరియు అవసరమైన పత్రాలను సమర్పించడం ద్వారా ఈ పథకాన్ని పొందే అవకాశం ఉంది. ట్రాక్టర్ ఉంటే రైతుకు చాలా మేలు జరుగుతుంది. కానీ ప్రస్తుతం ట్రాక్టర్ ల ధరలు కొనేలా లేవు. దీంతో కేంద్రం ప్రభుత్వం రైతులకు సగం ధరకే ట్రాక్టర్లను అందించే స్కీమును కూడా ప్రవేశపెట్టింది. పీఎం కిసాన్ ట్రాక్టర్ స్కీమ్ కింద.. ట్రాక్టర్ల కొనుగోలుపై 50శాలం సబ్సిడీతో ట్రాక్టర్లు కొనుగోలు చేసే వీలు కలిగించింది.