వైసీపీ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ని నడిరోడ్డుపై అరెస్ట్ చేశారు పోలీసులు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కలెక్టర్ కి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ని నడిరోడ్డుపై అరెస్ట్ చేశారు పోలీసులు.
అయితే… పోలీసుల తీరును తప్పుబట్టిన అవినాష్.. ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలు తగవని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులకు అండగా నిలవడం తప్ప అంటూ పోలీసులను నిలదీశారు అవినాష్. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు అవినాష్ తో పాటు మరికొంతమంది వైసీపీ నేతలు అరెస్ట్ అయ్యారు. ఇక అరెస్ట్ అయిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు అవినాష్ ని ఎక్కడకు తీసుకు వెళ్తున్నారో కూడా సమాధానం చెప్పడం లేదు పోలీసులు. అటు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ను అడ్డుకున్నారు పోలీసులు.