దేశంలోనే జనాలు ఎక్కువగా బుక్ చేసుకుంటున్న కారు ఇదే..

www.mannamweb.com


ప్రస్తుతం స్కోడా కార్లు మార్కెట్‌లో జెట్‌ స్పీడ్‌లో దూసుకెళ్తున్నాయి. దేశంలో ఈ మధ్య కాలంలో సబ్-4 మీటర్ల కాంపాక్ట్ ఎస్‌యూవీలకు భారీ డిమాండ్‌ని కలిగి ఉన్నాయి.

ఈ సెగ్మెంట్‌లో మారుతి సుజుకి బ్రెజా టాప్‌లో కొనసాగుతుండగా.. ఆ తర్వాత టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మహీంద్రా XUV 3XO మంచి కార్లు మంచి అమ్మకాలను రాబడుతున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి స్కోడా కొత్త కారు చేరిపోయింది. స్కోడా అంటే ప్రీమియం బ్రాండ్‌ అనే అపవాదు ఉండేది కానీ ఇప్పుడు బడ్జెట్‌ ధరలో కారుని తీసుకువచ్చి ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం ఆటోమోబైల్‌ మార్కెట్‌లో ఈ కారు ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఆ కారుకి సంబంధించిన లేటెస్ట్‌ అప్‌డేట్‌పై ఓ కన్నేయండి.

తాజాగా స్కోడా ఇండియా కైలక్ ఎస్‌యూవీని (Skoda Kylaq) మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ఈ కారుని ముఖ్యంగా మాస్‌ టార్గెట్‌ని టార్గెట్‌ చేస్తూ తీసుకురావడంతో అతి తక్కువ సమయంలో మంచి పాపులారిటీని సాధించింది. ఇటీవలె ఈ కారు వేరియంట్లు, ధరలను స్కోడా వెల్లడించింది. దీని బుకింగ్స్‌ డిసెంబర్ 2న ప్రారంభం అవ్వడంతో ఎవ్వరూ ఊహించని విధంగా కస్టమర్లు రిజర్వ్‌ చేసుకుంటున్నారు. దీనికి వస్తున్న రెస్పాన్స్‌కి ఇతర కంపెనీలు సైతం విస్తుపోతున్నాయి.

బుకింగ్స్‌ ప్రారంభమైన కేవలం 10 రోజుల్లో 10,000 యూనిట్లకు పైగా బుకింగ్స్‌ వచ్చాయి. ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ కారు తొలి 33,333 మంది వినియోగదారులకు లిమిటెడ్‌ ఆఫర్‌ని ప్రకటించింది. ఈ ఆఫర్‌ కింద ఈ కారుని 3 సంవత్సరాల వరకు ఉచిత మెయింటైనెన్స్ ప్యాకేజీ లభిస్తుంది. దేశంలోనే అత్యంత తక్కువ మెయింటైనెన్స్‌ (24 పైసలు) కలిగి ఉన్న బెస్ట్‌ కారు ఇదే కావడం గమనార్హం.

ఈ కొత్త స్కోడా కైలక్ ఎస్‌యూవీ డెలివరీలు జనవరి 27 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆ లోపు ఈ స్కోడా కారుని కస్టమర్లతో కనెక్ట్ చేసేందుకు ఇండియా అంతటా ‘డ్రీమ్ టూర్’ను ప్రారంభించనుంది. ఇది డిసెంబర్ 13న పుణెలోని కంపెనీకి చెందిన చకన్ ప్లాంట్ నుంచి మూడు కైలాక్ ఎస్‌యూవీలు 43 రోజుల పాటు 70 నగరాలను కవర్ చేయనున్నాయి. దేశమంతటా ఈ టూర్‌ కొనసాగనుంది.

ఈ కొత్త స్కోడా కైలాక్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ధర రూ .7.89 లక్షలు (ఎక్స్-షోరూమ్), టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ .14.40 లక్షలు (ఎక్స్-షోరూమ్) మధ్య అందుబాటులో ఉంది. ఈ స్కోడా కైలాక్‌లోనూ కుషాక్, స్లావియా కార్లలో కనిపించే 1.0-లీటర్ TSi పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేయనుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్స్‌తో వస్తుంది.

ఈ ఇంజిన్ 115 bhp, 178 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇతర పోటీ కార్లతో సమానంగా భారీ సేఫ్టీ, హై ఎండ్‌ ఫీచర్లను కలిగి ఉంది. సేఫ్టీ పరంగా ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు కలవు.

ఇక ఇందులో ఇంటీరియర్‌ ఫీచర్ల పరంగా చూస్తే వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో/ ఆపిల్ కార్ ప్లే, 8-అంగుళాల డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, వైర్‌లెస్ మోబైల్‌ ఛార్జింగ్‌, సింగిల్ పేన్‌ సన్‌రూఫ్‌, ఫ్రంట్ సీట్ వెంటిలేషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు క్లాసిక్‌, సిగ్నేచర్‌, ప్రెస్టీజ్‌ అనే వేరియంట్లలో లభిస్తుంది. వేరియంట్లను బట్టి ఫీచర్లు మారుతు ఉంటాయి.