విమానంలో ఎంత డబ్బు, మద్యం, బంగారం తీసుకెళ్లవచ్చు తెలుసా ?

ఎవరైనా ఫారెన్ వెతున్న లేదా ఇండియాకి వస్తున్న ఎయిర్ పోర్టు రూల్స్ ఒకోసారి తెలియక కొన్ని కొన్ని అనుకోనివి ఎదురుకోవాల్సి వస్తుంది. అయితే ఫ్లయిట్లో ఎం తీసుకెళ్లొచ్చు, ఎంత వరకు అనుమతి ఉంటుంది అనే వాటిపై మాత్రం రూల్స్ ఉంటాయి.


విమాన ప్రయాణ సమయంలో ఈ రూల్స్ తెలియకపోతే చాలా ఇబ్బందులకు గురవుతారు. విమానాల్లో డబ్బు తీసుకెళ్లేందుకు పరిమితి ఏంటో తెలుసా? ఈ పరిమితి దేశీయ విమానాలలో ఇంకా అంతర్జాతీయ విమానాలలో వేరువేరుగా ఉంటుంది.

ఇతర దేశాలకి వెళ్లినా లేదా స్వంత దేశంలో ఎక్కడికైనా ప్రయాణించినా చెప్పాలంటే కొందరు ప్రజలు ఎక్కువగా విమానంలోనే వెళ్లడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఇతర మార్గాలతో పోలిస్తే విమానంలో తక్కువ టైంలోనే మీ గమ్యాన్ని చేరుకోవచ్చు. అయితే ఫ్లయిట్ జర్నీలో మీ లగేజ్లో తీసుకెళ్లే వస్తువులను చూసుకోవాలి, ఏంటంటే లగేజీ బరువు పరిమితికి మించకూడదు, ఎందుకంటే బరువు ఎక్కువగా ఉంటే మీరు అందుకు చార్జెస్ చెల్లించాలి. మరోవైపు మీరు మీతో పాటు ఎంత డబ్బు తీసుకెళ్లవచ్చో దానికి కూడా ఒక లిమిట్ పెట్టారు. మీరు విమానంలో ప్రయాణించేటప్పుడు మీతో డబ్బు తీసుకెళ్లాలనుకుంటే మీరు మీ బ్యాగ్‌లో కొంత మొత్తం డబ్బును మాత్రమే తీసుకెళ్లవచ్చు. క్యాష్ విత్ డా ఫెసిలిటీ ఇండియాలో ఇంకా విదేశాలలో ఉన్న కూడా డబ్బు సొంతంగా తీసుకెళ్లడానికి ఇష్టపడే వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారు ఎంత డబ్బు తీసుకెళ్లవచ్చో తెలుసా…

విమానంలో ఎంత డబ్బు తీసుకెళ్ళవచ్చు?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం, మీరు దేశీయ విమానంలో ప్రయాణిస్తున్నట్లయితే మీరు రూ. 2 లక్షల క్యాష్ మీతో తీసుకెళ్లవచ్చు. కానీ మీరు విమానంలో విదేశాలకు వెళుతున్నట్లయితే ఈ రూల్ వేరేలా ఉంటుంది.

విదేశీ ప్రయాణాలకి ఎంత నగదు తీసుకెళ్లొచ్చు ?

మీరు నేపాల్, భూటాన్ కాకుండా ఇతర దేశాలకి విమానంలో వెళ్తే మీరు మీతో పాటు 3000 డాలర్ల వరకు విదేశీ కరెన్సీని తీసుకెళ్ళవచ్చు. అయితే మీరు ఇంతకంటే ఎక్కువ డబ్బు తీసుకెళ్లాలనుకుంటే మీకు ట్రావెల్ కార్డు అండ్ ట్రావెల్ చెక్కులు అవసరం.

విమానంలో లగేజీ బరువు ఎంత ఉండాలి?

మీరు విమానంలో లిమిట్ వరకు మాత్రమే డబ్బు తీసుకెళ్లగలిగేలా లగేజీ బరువుకు సంబంధించి కూడా ఒక రూల్ ఉంది. మీరు మీ హ్యాండ్‌బ్యాగ్‌లో 7 నుండి 14 కిలోల బరువును పెట్టుకోవచ్చు. బోర్డింగ్ పాస్ తీసుకునేటప్పుడు మీరు కౌంటర్లో ఇచ్చే చెక్-ఇన్ బ్యాగేజీ బరువు 20 నుండి 30 కిలోల వరకు ఉండొచ్చు. అంతర్జాతీయ విమానాలకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది. మీకు లగేజ్ బరువు గురించి ఖచ్చితమైన సమాచారం కావాలంటే మీరు మీ విమానానికి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్‌ ద్వారా చెక్ చేయవచ్చు.

విమానంలో ప్రయాణించేటప్పుడు ఎలాంటివి తీసుకెళ్లకూడదు?

విమానంలో ప్రయాణించేటప్పుడు మీరు కొన్ని వస్తువులను మీతో తీసుకెళ్ళలేరు. ఎందుకంటే విమాన ప్రయాణంలో కొన్ని వస్తువులను తీసుకెళ్లడం నిషిద్ధం. ఉదాహరణకు క్లోరిన్, యాసిడ్, బ్లీచ్ వంటి కెమికల్స్ సహా మరికొన్ని వాటిని కూడా తీసుకెళ్లలేరు.

విమానాలలో మద్యం తీసుకెళ్ళొచ్చా?

దీనికి సంబంధించి మీరు మీ చెక్-ఇన్ బ్యాగ్‌లో ఆల్కహాల్‌ తీసుకెళ్లవచ్చు, అయితే 5 లీటర్ల కంటే ఎక్కువ మద్యం ఉండకూడదు. అంతే కాదు బంగారం సంబంధించి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఇవి ఒక దేశం నుండి మరొక దేశానికి మారుతుంటుంది. ఫ్లయిట్లో తీసుకెళ్లే ప్రతి వస్తువు లేదా బంగారానికి సంబంధించిన పేపర్స్ మాత్రం తప్పనిసరి ఉండాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.