ఈ బిజీ లైఫ్‌లో సంపూర్ణ ఆరోగ్యంగాన్ని ఎలా పొందగలమని చాలామంది బాధపడుతుంటారు. కొద్దిపాటి చిట్కాలతో ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండొచ్చట. ఇక్కడ కొద్దిపాటి శ్రద్ధ ఉంటే చాలంటున్నారు నిపుణులు.
వర్కౌట్‌లు, డైట్‌లు చేయకపోయినా.. తినే ఆహారంపై కాసింత స్ప్రుహ ఉంటే చాలు..సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం అంటున్నారు నిపుణులు. అదెలాగో చూద్దామా..!.
మైదాతో చేసిన పదార్థాలకు దూరంగా ఉంటే సగం వ్యాధుల దరిచేరవట.
అలాగే పంచదారను నివారించటం అంటే..టీ, కాఫీల్లో పర్లేదని లైట్‌గా తీసుకోకూడదట. వాటిల్లో కూడా పూర్తిగా నివారించి దానికి బదులుగా ఫ్రూట్ స్వీట్స్ లేదా బెల్లం జోడించండి చాలు.
మరొకటి బంగాళ దుంపలు ఆరోగ్యకరమైన రీతిలో తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండదట. డీఫ్ ఫై, చిప్స్ రూపంలో అయితే అస్సలు వద్దని చెబుతున్నారు. ఇది గుండె ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తుందట
చివరిగా తెల్లబియ్యం నివారించాలట. బాగా పాలిష్ పెట్టిన బియ్యం కాకుండా పొట్టు తక్కువగా తీసిని బియ్యం, ముడిబియ్యం లేదా బ్రౌన్ రైస్ తీసుకోమంటున్నారు. అలాగే ఒకవేళ తినాలనుకున్న వైట్ రైస్‌ని మితంగా తీసుకునే యత్నం చేసినా చాలు. ఎలాంటి అనారోగ్య సమస్యలు బారినపడే అవకాశం ఉండదని చెబుతున్నారు నిపుణులు.
దీంతోపాటు పొగ, మద్యపానం వంటి చెడు అలవాట్లకు కూడా దూరంగా ఉండమని సూచిస్తున్నారు.
ఒకవేళ పైన చెప్పిన ఆ ఆహారాలను పూర్తిగా నిషేధించలేకపోయినా..కనీసం పరిమిత స్థాయిలో మితంగా తీసుకునే యత్నం చేసినా..సత్ఫలితాలను పొందగలరని చెబుతున్నారు నిపుణులు.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత నిపుణులను సంప్రదించి అనుసరించటం మంచిది.