పవన్ కల్యాణ్ కు షాక్ ఇచ్చిన వాలంటీర్లు

www.mannamweb.com


ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై కేసు పునర్విచారణకు హైకోర్టులో మహిళా వాలంటీర్ల తరఫున వ్యాజ్యం దాఖలయింది. ఈ పిటీషన్ ను న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ దాఖలు చేశారు.

గతంలో వాలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదయింది. అయితే కూటమి ప్రభుత్వం కేసును ఉపసంహరించుకోవడంపై హైకోర్టులో క్రిమినల్ రివిజన్ ఇద్దరు మహిళా వాలంటర్లు పిటిషన్ దాఖలు చేశారు.గత ప్రభుత్వంలో 30 వేల మంది మహిళలు కనపడకుండా పోవడానికి వారిని వ్యభిచార కూపంలోకి దించడానికి వాలంటీర్లు కారణమన్న ఆరోపణపై పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు అయింది. అప్పటి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ పై కేసు నమోదుకు జీవో కూడా జారీ చేసింది. అప్పట్లో గుంటూరు జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రధాన కోర్టులో కేసు దాఖలు చేశారు.

కేసు ఉపసంహరించుకోవడంపై…

కేసు దాఖలు అయిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కు గుంటూరులోని నాలుగవ అదనపు జిల్లా కోర్టు సమన్లు కూడా జారీ చేసింది. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఏ కారణం చూపకుండా పవన్ కళ్యాణ్ పై కేసు ఉపసంహరించుకుందని పిటీషన్ లో ఆరోపించారు. విజయవాడలోని ప్రజా ప్రతినిధుల కోర్టు మాత్రమే చేయి తగిన పనిని గుంటూరు నాలుగో అదనపు జిల్లా కోర్టు కేసు ఉపసంహరించడం చట్ట విరుద్ధమని పిటిషనర్లు తెలిపారు. గుంటూరు జిల్లా కోర్టు పరిధి దాటి పవన్ కళ్యాణ్ పై కేసు ఉపసంహరణకు అనుమతి ఇచ్చింది అన్న పిటీషనర్లు పేర్కొన్నారు. 30 వేల మంది వాలంటీర్లను అవమానపరిచిన పవన్ కళ్యాణ్ పై ఉపసంహరించుకోవడం ప్రభుత్వ అధికార దుర్వినియోగానికి అద్దం పడుతుందన్న పిటిషనర్లు తెలిపారు. పిటిషనర్ల తరపున వాదనలు ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వినిపించనున్నారు. అధికారం అడ్డం పెట్టుకుని కేసులు ఉపసంహరించుకోవడం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కు వ్యతిరేకమని పిటిషనర్లు తెలిపారు. ఈ కేసు రేపు విచారణకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నార.