Flat Belly in 30 Days : మగవారు చూసేందుకు ఫిట్‌గా ఉన్నా.. కొందిరికి పొట్ట దగ్గర మాత్రం కొవ్వు ఉంటుంది. అయితే ఇలా బెల్లీ దగ్గర ఏర్పడే కొవ్వు ఆరోగ్యానికి మంచిది కాదు.
ముఖ్యంగా ఇది వారిలో గుండె సమస్యలకు దారిస్తుందని పలు అధ్యయనాలు తెలిపాయి. అందుకే జెంట్స్ పొట్టను కచ్చితంగా తగ్గించుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. దానికోసం రెగ్యులర్‌గా కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలంటున్నారు. ముఖ్యంగా 35 నుంచి 69 వయసు మధ్య ఉన్నవారు ఈ విషయాన్ని నెగ్లెక్ట్ చేయవద్దని చెప్తున్నారు. దానిని ఎలా కంట్రోల్ చేయవచ్చో ఇప్పుడు చూసేద్దాం.
హైడ్రేషన్..
మంచి నీటిని రెగ్యులర్‌గా తీసుకుంటే స్కిన్ హెల్తీగా ఉంటుంది. వయసు కంటే యవ్వనంగా కనిపిస్తారు. అలాగే మెటబాలీజం పెరుగుతుంది. ఆకలిని తగ్గించి.. పొట్ట కొవ్వును కరిగించడంలో హైల్ప్ చేస్తుంది. రోజుకు 2 నుంచి 4 లీటర్ల నీటిని తాగితే మంచిది.
పోషకాహారం..
ఫుడ్ తినడం కాదు.. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో తెలిస్తే కూడా బరువు తగ్గడం, బెల్లీ ఫ్యాట్ తగ్గడం జరుగుతుంది. ఎనర్జీనిచ్చే ఫుడ్‌ని తినాలి. వీటివల్ల మెటబాలీజం పెరిగి పొట్ట దగ్గర కొవ్వు తగ్గుతుంది. ఒబేసిటీ సమస్యలను ఇది దూరం చేయడంలో హెల్ప్ చేస్తుంది. విటమిన్స్, మినరల్స్, అమోనో యాసిడ్స్ ఉండే పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగాను ఉంటారు. అలాగే పొట్ట దగ్గర కొవ్వు తగ్గుతుంది.
మెరుగైన నిద్రకై
మంచి నిద్ర ఆరోగ్యంగా ఉంచడంతో పాటు.. బరువును కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. బెడ్ కంఫర్ట్‌బుల్‌గా ఉండేలా చూసుకోవాలి. మీరు పడుకునే రూమ్ చీకటిగా ఉంటే మెరుగైన నిద్ర మీ సొంతమవుతుంది. రాత్రి 9 నుంచి 10 మధ్యలో పడుకుంటే మంచిది. గదిలో ఉష్ణోగ్రతలు కూడా మీకు కంఫర్ట్‌బుల్‌గా ఉండేలా చూసుకోవాలి.
ఫాలో అవ్వాల్సిన టిప్స్
రాత్రి పడుకునే మూడు గంటల ముందే డిన్నర్ ముగించేయాలి. రెండు గంటల ముందు నుంచి నీటిని తాగకపోవడమే మంచిది. గంట ముందు నుంచి మొబైల్స్, గ్యాడ్జెట్స్ ఉపయోగించకకూడదు. దీనివల్ల నిద్ర నాణ్యత పెరుగుతుంది.
వ్యాయామం
కనీసం వారంలో మూడు రోజులు బరువులు ఎత్తడం ప్రాక్టీస్ చేయాలి. బరువును తగ్గించుకునేందుకు, కేలరీలను బర్న్ చేస్తూ గుండెను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు కార్డియో చేయాలి. రోజుకు కనీసం 10 నుంచి 20 వేలు స్టెప్స్ వేయాలి. ఇవన్నీ చేయడం వల్ల హార్మోన్ స్పైక్ అయ్యి.. కొవ్వును కరిగించడంలో హెల్ప్ చేస్తుంది.
ఒత్తిడి తగ్గించుకోండి..
ఒత్తిడి వల్లనే పొట్ట చుట్టు ఎక్కువ కొవ్వు ఏర్పడుతుంది. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకునే మార్గాలను ఫాలో అవ్వాలి. వ్యాయామం చేస్తూ.. హెల్తీగా తింటూ.. ఓపెన్ మైండ్‌తో.. పనిని రెస్పాన్స్‌బులిటీగా చేస్తూ ఉంటే స్ట్రెస్ తగ్గుతుంది. మెడిటేషన్, వ్యాయామం, యోగా.. స్ట్రెస్‌ని దూరం చేస్తాయి. అలాగే చేయాల్సిన పనిని పెండింగ్‌లో పెట్టకుండా వెంటనే ముగించుకుంటే ఒత్తిడి ఉండదు. నచ్చిన వ్యక్తితో మాట్లాడినా కూడా స్ట్రెస్ తగ్గుతుంది.
ఫాస్టింగ్..
రోజులో మీరు 4 నుంచి 8 గంటల్లో ఫుడ్ తింటే.. మరింత సమయాన్ని మీరు జీర్ణశయం రీసెట్ అవ్వడానికి వదిలేయాలి. దీనిని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు. దీనిని ఫాలో అవ్వాలనుకుంటే కచ్చితంగా వైద్యుల సలహా తీసుకోవాలి. వారు ఇచ్చే సూచనలతో మీరు మెరుగైన ఫలితాలు పొందుతారు. వారంలో ఒక రోజు లేదా.. నెలలో మూడు నుంచి నాలుగు రోజులు పూర్తిగా ఉపవాసం ఉంటే కూడా మంచిదే. ఎక్కువ రోజులు ఫాస్టింగ్ ఉంటే.. శరీరానికి బి విటిమిన్స్, ఎలక్ట్రోలైట్ డ్రింక్, ఉప్పు కలిపిన నీళ్లు తాగితే మంచిది.
వాటికి దూరంగా ఉండండి..
కార్బ్స్, ఆల్కహాల్, పంచదార ఎక్కువ కలిగిన ఫుడ్స్‌కి వీలైనంత దూరంగా ఉండాలి. లేదంటే ఇవి శరీరంలో ఇన్సులిన్ లెవెల్స్‌ని పెంచుతాయి. దీనివల్ల ఫ్యాట్ బర్న్ అవ్వదు. తద్వార పొట్ట దగ్గర కొవ్వు తగ్గదు. కాబట్టి వీటికి వీలైనంత దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఎవరూ పర్ఫెక్ట్ కాదు. కానీ ట్రై చేస్తే అందరూ పర్ఫెక్ట్ కావొచ్చు. అలాగే పొట్టను తగ్గించుకోవాలనుకున్నప్పుడు కనీసం మీరు 85 శాతం ఎఫెర్ట్స్ పెడితే.. మిగిలిన 15 శాతం మీరు ఫాలో అవ్వకపోయినా మంచి ఫలితాలు పొందవచ్చు.