వందేళ్ల ఆరోగ్యానికి, యవ్వనానికి మన పెద్దలు పాటించిన చిట్కా.. దీన్ని ఇలా చేసి రోజూ తినండి

www.mannamweb.com


మనం రోజూ ఉదయం అల్పాహారంగా ఇడ్లీ, దోశ, వడ, ఇలా అనేక రకాల వంటకాలను తయారు చేసి తీసుకుంటూ ఉంటాము. అయితే పూర్వకాలంలో ఇటువంటి అల్పాహారాలు ఏమి లేని రోజుల్లో మన పెద్దలు చద్దనాన్ని తయారు చేసి తీసుకునే వారు.

చద్దనాన్ని తీసుకోవడం వల్ల శరీరం బలంగా తయారవుతుంది. రోజంతా ఉత్సాహంగా పని చేసుకోవచ్చు. ఎముకలు ధృడంగా తయారవుతాయి. పొట్ట ఆరోగ్యం మెరుగుపడుతుంది. వేసవికాలంలో మట్టి పాత్రలో తయారు చేసిన చద్దనాన్ని తీసుకోవడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. కనుక కనీసం వారంలో ఒక్కసారైనా చద్దనాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. దీనిని వివిధ రకాలుగా తయారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా చేయడం వల్ల చాలా సులభంగా చద్దనాన్ని తయారు చేసుకోవచ్చు. శరీరానికి చలువ చేయడంతో పాటు ఆరోగ్యానికి మేలు చేసే ఈ చద్దనాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

చద్దన్నం తయారీకి కావల్సిన పదార్థాలు..

గంజి – ఒక కప్పు, అన్నం – ఒకటిన్నర కప్పులు, వేడి పాలు – ఒకటిన్నర కప్పు, పెరుగు – ఒక టీ స్పూన్. పచ్చిమిర్చి – 2, పెద్ద ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయ – 1, ఉప్పు – తగినంత.

చద్దన్నం తయారీ విధానం..

ముందుగా అన్నం ఉడికేటప్పుడే గంజిని వార్చి పక్కకు ఉంచాలి. అలాగే మనం తినగా మిగిలిన అన్నాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో చల్లారిన గంజి వేసి కలపాలి. తరువాత ఇందులో వేడి పాలు పోసి కలపాలి. పాలుగోరు వెచ్చగా అయ్యే వరకు ఉంచాలి. పాలు గోరు వెచ్చగా అయిన తరువాత ఇందులో పెరుగు వేసి కలపాలి. దీనిని అంతా కలిసేలా బాగా కలుపుకున్న తరువాత పైన ఉల్లిపాయ ముక్కలు, గాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి మూత పెట్టాలి. దీనిని రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజూ ఉదయానికి చద్దన్నం తయారవుతుంది. ఇది మరీ గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి. తరువాత ఉప్పు వేసి కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల చద్దన్నం తయారవుతుంది. దీనిని ఉల్లిపాయ, పచ్చిమిర్చితో కలిపి తింటే మరింత రుచిగా ఉంటుంది. ఈ విధంగా చద్దనాన్ని తయారు చేసి తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.