అర స్పూన్. పాలు లేదా నీటిలో కలిపి తాగితే చాలు 100 ఏళ్ళు వచ్చిన మోకాళ్ళ నొప్పులు ఉండవు

www.mannamweb.com


అవిసె గింజలలో ఎన్నో ఊహించని ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో వీటి వాడకం కూడా చాలా పెరిగింది. ఒకప్పుడు అరుదుగా లభించినా..

ప్రస్తుతం చాలా విరివిగా లభిస్తున్నాయి.

ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయస్సులోనే అంటే 30 ఏళ్ళు వచ్చేసరికి మోకాళ్ళ నొప్పులు,కీళ్ల నొప్పులు వచ్చేస్తున్నాయి. ఇలా చిన్న వయస్సులోనే నొప్పులు రావటంతో చాలా కంగారూ పడి ఎన్నో రకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. అవి పెద్దగా ఫలితాన్ని ఇవ్వవు.

నొప్పులు ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఇంటి చిట్కాలను ఫాలో అవ్వవచ్చు. నొప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు డాక్టర్ సలహాను పాటిస్తూ ఇలా ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా తొందరగా మంచి ఫలితం వస్తుంది. నొప్పులను తగ్గించటానికి అవిసె గింజలు చాలా బాగా సహాయపడతాయి. అవిసె గింజలను వేగించి పొడిగా చేసుకోవాలి.

ఈ పొడి దాదాపుగా పది రోజుల పాటు నిల్వ ఉంటుంది. ప్రతి రోజు ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని పాలు లేదా గోరువెచ్చని నీటిలో అరస్పూన్ పొడిని కలిపి తాగితే నొప్పులు తగ్గటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కాస్త శ్రద్దగా పొడి తయారుచేసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు.

వీటిలో ఒమేగా 3 ఫ్యాటి యాసిడ్స్ సమృద్దిగా ఉండుట వలన చెడు కొలెస్ట్రాల్ తొలగించి రక్త ప్రసరణ బాగా సాగేలా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అలాగే అధిక బరువు మరియు శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించటంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు,కీళ్ల నొప్పులు ఉన్నవారు తప్పనిసరిగా ఈ పొడిని తీసుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది.

ఈ పొడి కీళ్ల మధ్య జిగురును పెంచటానికి కూడా సహాయపడుతుంది. అలాగే అజీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. మహిళలకు మోనోఫాజ్ సమయంలో వచ్చే సమస్యలను తగ్గిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి కూడా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచటానికి సహాయపడుతుంది. కాబట్టి ఈ పొడిని అరస్పూన్ మోతాదులో ప్రతి రోజు తీసుకొని ఈ ప్రయోజనాలను పొందండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.