ఐఫోన్ 16 స్మార్ట్‌ఫోన్‌ పై భారీ తగ్గింపు ఆఫర్‌.. ఈ బ్యాంకు కార్డులపై రూ.5000 డిస్కౌంట్‌

www.mannamweb.com


ఆపిల్‌ నుంచి ఐఫోన్‌ 16 సిరీస్‌ హ్యాండ్‌సెట్‌ లు సెప్టెంబర్‌ నెలలో విడుదల అయ్యాయి. అదే నెలలో సేల్‌ కూడా ప్రారంభం అయింది. ఐఫోన్‌ 16 సిరీస్‌ లో భాగంగా ఐఫోన్‌ 16, ఐఫోన్‌ 16 ప్లస్‌, ఐఫోన్‌ 16 ప్రో, ఐఫోన్‌ 16 ప్రో మ్యాక్స్‌ హ్యాండ్‌సెట్‌ లు అందుబాటులోకి వచ్చాయి. విడుదల సమయంలో ఈ హ్యాండ్‌సెట్‌ బేస్‌ వేరియంట్‌ ధర రూ.79,900 గా ఉంది.

ప్రస్తుతం అమెజాన్‌లో ఈ హ్యాండ్‌సెట్‌ ను డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు. మరియు బ్యాంక్‌ ఆఫర్ల ద్వారా మరింత తగ్గింపును పొందవచ్చు.
ప్రస్తుతం అమెజాన్‌లో ఐఫోన్‌ 16 స్మార్ట్‌ఫోన్‌ (iPhone 16 Smartphone Price Drop) 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.77,400 గా ఉంది. అంటే విడుదల ధర కంటే సుమారు రూ.2500 తగ్గింపునకు అందుబాటులో ఉంది. అయితే SBI క్రెడిట్‌ కార్డు, ఐసీఐసీఐ బ్యాంకు కార్డులు, కోటక్‌ మహీంద్రా క్రెడిట్‌ కార్డులతో అదనంగా రూ.5,000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

విడుదలైన కొద్ది రోజులకే తగ్గింపు ధరకు : అయితే ఈ ఆఫర్‌ ఎప్పటి వరకు ఉందో వెల్లడి కాలేదు. ఐఫోన్‌ 16 విడుదలైన కొద్ది రోజులకే తగ్గింపు ధరకు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది.

ఈ హ్యాండ్‌సెట్‌ 256GB స్టోరేజీ రూ.89,990, 512GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.1,09,900 గా ఉంది. ఐఫోన్ 16 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు : ఐఫోన్ 16 స్మార్ట్‌ఫోన్‌ 6.1 అంగుళాల సూపర్‌ రెటీనా XDR OLED డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 2000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ ఐఫోన్‌ సిరామిక్‌ షీల్డ్‌ రక్షణను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 3nm ఆక్టాకోర్‌ A18 చిప్‌సెట్‌, iOS 18 పైన పనిచేస్తోంది.

ఆపిల్‌ ఇంటెలిజెన్స్‌ : ఈ ఐఫోన్‌ 16 మోడల్‌ ఆపిల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ 6-కోర్‌ CPU, 5-కోర్‌ GPU, 16 కోర్‌ న్యూట్రల్‌ ఇంజిన్‌ వంటి ఫీచర్లతో అందుబాటులో ఉంది. దీంతోపాటు కెమెరా కంట్రోల్ బటన్‌ సహా యాక్షన్‌ బటన్‌, డైనమిక్‌ ఐలాండ్‌ ఫీచర్‌ను కలిగి ఉంది. 48MP కెమెరా : కెమెరా విభాగం పరంగా ఐఫోన్‌ 16 స్మార్ట్‌ఫోన్‌ 2X ఇన్‌సెన్సార్‌ జూమ్‌, f/1.6 అపేచర్‌తో 48MP కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు ఆటోఫోకస్‌, f/2.2 అపేచర్‌తో 12MP అల్ట్రావైడ్‌ కెమెరాతో అందుబాటులో ఉంది. వీటితోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 12MP ట్రూడెప్త్‌ కెమెరాను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా ఐఫోన్ 16 స్మార్ట్‌ ఫోన్‌ 5G, 4G LTE, బ్లూటూత్‌, Wi-Fi 6E, NFC, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. IP68 రేటింగ్‌ తో డస్ట్ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంది. ఐఫోన్‌ 16 బ్లాక్‌, పింక్‌, టీల్‌, అల్ట్రామెరిన్‌, వైట్‌ రంగుల్లో లభిస్తుంది.