68 కి.మీ భారీ మైలేజీ ఇచ్చే బైక్‌.. ధర రూ. 59 వేలు మాత్రమే..

www.mannamweb.com


TVS మోటార్స్ నుంచి అందుబాటులో ఉన్న మోటార్‌సైకిల్స్ మార్కెట్ లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఈ కంపెనీ ఇచ్చిన అందుబాటులో ఉన్న మోటార్ సైకిల్స్ భారీ మొత్తంలో మైలేజ్ అందిస్తున్నాయి. వీటిలో చాలావరకు మోటార్ సైకిల్స్ మంచి సేల్స్ ని రాబడుతున్నాయి. ఏ జాబితాలో టీవీఎస్ రేడియన్ ఒకటిగా ఉంది.

తాజాగా టీవీఎస్ రేడియన్ ఆల్ బ్లాక్ ఎడిషన్‌లో కొత్త అప్‌డేట్‌తో విడుదల చేసింది. ఇది ఫ్యూయల్ ట్యాంక్, సైడ్ ప్యానెల్స్‌పై షైనింగ్ బ్లాక్ కలర్ తో పాటు TVS Radeon బ్యాడ్జింగ్‌తో కొత్త ఆల్-బ్లాక్ కలర్‌తో వస్తుంది. దీని రాకతో ఇప్పుడు బైక్ ని కొనే వారి సంఖ్య పెరిగింది. అలాగే ఇంజిన్ కవర్ కాంట్రాస్ట్ కలర్ ప్రత్యేకంగా ఇవ్వబడింది. అందువల్ల జనాలు దీని కాంట్రాస్ట్ లుక్ కి జనాలు ఫిదా అయిపోయారు. ఈ బైక్ గురించి తాజా సమాచారం మీకోసం..

ప్రస్తుతం 110cc సెగ్మెంట్ లో TVS Radeon మోటార్ సైకిల్ హీరో స్ప్లెండర్ ప్లస్, బజాజ్ సిటీ 110X, హోండా CD 110 డ్రీమ్ బైక్‌లకు గట్టి పోటీని ఇస్తోంది. ఇప్పుడు ఆల్ బ్లాక్ ఎడిషన్ విడుదల చేయడంతో పోటీ మరింత పెరిగింది. ఈ కొత్త TVS Radeon ప్రస్తుతం బేస్ DG డ్రమ్, DG డిస్క్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఈ కొత్త రేడియాన్ ధర ఇప్పుడు రూ.59,880 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఈ కొత్త TVS రేడియాన్‌ వినియోగదారులకు మరింత అందుబాటులో ఉండేలా చేయడానికి బేస్ వేరియంట్ ధరను సైతం తగ్గించింది. అలాగే మిడ్-స్పెక్ DG డ్రమ్ వేరియంట్ ధర రూ. 77,394 (ఎక్స్-షోరూమ్)గా.. టాప్-స్పెక్ DG డిస్క్ రూ. 81,394 (ఎక్స్-షోరూమ్)గా అందుబాటులో ఉంది.

ఈ కొత్త ఆల్ బ్లాక్ ఎడిషన్ TVS రేడియన్‌ మొత్తం 7 కలర్‌ ఆప్షన్స్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ TVS రేడియాన్‌ 10 లీటర్ల ఇంధన ట్యాంక్ కెపాసిటీని కలిగి ఉంది. ఈ బైక్‌ 180 mm గ్రౌండ్ క్లియరెన్స్‌తో వస్తుంది. ఇందులో అదనపు సౌలభ్యం కోసం LCD స్క్రీన్, USB ఛార్జింగ్ పోర్ట్‌ని అందిచారు. ఈ ప్రైజ్‌ రేంజ్‌లో ఇది అందిచడం గొప్ప విషయంగా చెప్పవచ్చు. ఈ బైక్‌ని ఏక కాలంలో నిలిపి వేసేందుకు కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ (CBS)తో వస్తుంది. ఇది డ్రమ్ వేరియంట్ 130 mm ఫ్రంట్ డ్రమ్ బ్రేక్‌తో, డిస్క్ వేరియంట్‌ ముందు 240 mm డిస్క్‌తో వస్తుంది. ఈ రెండు వెర్షన్లలో 110mm వెనుక డ్రమ్ బ్రేక్‌ కలదు. ఇది టెలిస్కోపిక్ ఫోర్క్, ప్రీలోడ్-అడ్జస్టబుల్ షాక్ అబ్జార్బర్స్‌ని కలిగి ఉంది. అందువల్ల సస్పెన్షన్‌లో ఈ బైక్స్‌ అదరగొడుతాయి.

ఇక ఈ బైక్‌ డ్రమ్ వేరియంట్ బరువు 113 కిలోలు, డిస్క్ వేరియంట్ బరువు 115 కిలోలుగా ఉంది. ఈ TVS రేడియాన్‌ 109.7 cc ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 8 PS పవర్, 8.7 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌ 68 కి.మీ భారీ మైలేజీని ఇస్తుందని కంపెనీ తెలిపింది.