మహిళలకు సర్కార్ గుడ్‌న్యూస్‌.. టెన్త్ పాసైతే చాలు.. వేతనం ఎంతంటే

www.mannamweb.com


గ్రామాల్లో ఉండే మహిళలకు ఇది ఒక శుభవార్తే.. యువతులు ఒకవేళ, ఇంటర్ వరకు చదివినా, లేదా టెన్త్ పాసై ఇంటికే పరిమితమైతే మాత్రం ఇది వారికి గొప్ప అవకాశం.

ఊళ్లలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటూ, ఎక్కువ చదువుకోలేదని, ఇలా వివిధ సమస్యల కారణంగా అక్కడే ఏదో ఒక చిన్న ఉద్యోగం చేస్తూ జీవనం గడుపుతున్నారు. అటువంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వం ఒక ఉద్యోగావకాశాన్ని ప్రకటించింది.

‘బీమా సఖి యోజన’. ఈ పథకం మహిళలకు ఎంతో ఉపయోగకరం.. అతి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలకు ఈ పథకం మరింత ప్రయోజనం కలిగిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంలో ఏఏ ప్రయోజనాలు పొందొచ్చు.. ఎవరికి ఈ పథకం వర్తిస్తుంది.. ఎంత డబ్బులు సంపాదించొచ్చు అనేది పూర్తిగా తెలుసుకుందాం.

ఈ పథకంలో భాగంగా ఉద్యోగులు బీమాకు సంబంధించిన కొన్ని పనులు నిర్వహించాల్సి ఉంటుంది. దీనికోసం ఎంపికైన మహిళలకు ముందుగా ట్రైనింగ్ ఇస్తారు, అనంతంరం వారిని ఎల్ఐసీ (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) బీమా సఖిగా నియమిస్తారు.

అంటే, మహిళలు ఎల్ఐసీ ఏజెంట్లుగా విధులు నిర్విహించాల్సి ఉంటుంది. అంతేకాదు, ఈ పథకంలో చేరిన నుంచి బీమా సఖులు ప్రజలకు బీమా చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలు ఎక్కువగా ప్రయోజనం పొందుతారు.

10వ తరగతి ఉత్తీర్ణులైన మహిళలు అర్హులు. వీరు 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయస్సు మధ్య ఉండాలి. దీనికి ఉద్యోగానికి సంబంధించి మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు దీని అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించండి.

ఈ పథకం కింద ప్రతి నెల రూ.7,000 నుంచి రూ.21,000 వరకు అందిస్తారు. అయితే, ఇక్కడ మీరు గమనించాల్సిన మరోక విషయం ఏంటంటే.. ఈ బీమా సఖి పథకం ప్రారంభంలో ఒక్కో మహిళకు ప్రతి నెల రూ.7,000 చెల్లిస్తారు. రెండో ఏడాదికి వచ్చేసరికి రూ.1000 తగ్గించి రూ.6000 ఇస్తారు. మూడో ఏడాదికి వచ్చేసరికి మరో రూ.1000 తగ్గించి రూ.5000 చెల్లిస్తారు. ఇది మాత్రమే కాకుండా మహిళలకు ప్రత్యేకంగా రూ.21,000 అందుతుంది. అదే సమయంలో బీమా లక్ష్యాలను పూర్తి చేసిన వారికి స్పెషల్ కమీషన్ కూడా అందిస్తారు.

కేంద్రం ప్రారంభించిన ఈ పథకంలో భాగంగా మొత్తం 3 ఏళ్లలో 2 లక్షల మందికి ఉపాధి కల్పించాలని మోదీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో తొలి దశలో 35,000 మందిని బీమా ఏజెంట్లు తీసుకుంటారు. ఆ తర్వాత 50,000 మంది మహిళలను ఎంపిక చేస్తారు. ఇలా మొత్తం 2 లక్షల మందికి బీమా ఏజెంట్లు ఉపాధి కల్పిస్తారు.