చలికాలం, వర్షాకాలం స్నానం చేయడం అంటే పెద్ద కష్టం. ఇంకా చల్ల నీరుతో స్నానం చేయడం మరింత కష్టం. అసలు చేయరు కూడా చాలా మంది. అందుకే వాటర్ హీటర్, కట్టెల పొయ్యి, గీజర్, గ్యాస్ స్టవ్ ఇలా ఏదో ఓకటి ఉపయోగించి నీరును వేడి చేసుకున్నాకే స్నానం అంటారు.
మిగిలిన వాటి సంగతి ఎలా ఉన్నా వాటర్ హీటర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాదు గీజర్ విషయంలో కూడా అంతే జాగ్రత్త పడాలి. లేదంటే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ గీజర్ ను సరిగ్గా వాడకపోతే అవి పేలే ప్రమాదం కూడా ఉంది. కొన్ని సార్లు పవర్ ఒకేసారి ఎక్కువగా వస్తుంటుంది. ఇలాంటి సమయాల్లో ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. అందుకే కాస్త ముందు జాగ్రత్తలు మస్ట్. ఇంతకీ గీజర్ ఎందుకు పేలుతుంది? పేలకుండా ఏం చేయాలి అనే వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
ముందు కట్టెల పొయ్యి మీద నీరు వేడి చేశారు. ఆ తర్వాత కిరోసిన్ స్టవ్, తర్వాత ఎల్ పీజీ గ్యాస్, ఇప్పుడు వాటర్ హీటర్ లు, ఇంట్లో గీజర్ లు ఇలా అప్డేట్ అవుతూ వచ్చాయి. కానీ వీటన్నింటి కంటే బెటర్ కట్టెల పొయ్యే అంటారు పెద్దవారు. ఇది పక్కన పెడితే బాత్రూమ్లోనే గీజర్స్ని పెట్టించుకునే వారి సంఖ్య మరింత ఎక్కువ అవుతుంది. దీనిని వాడడం చాలా సులభమే కానీ జాగ్రత్త మాత్రం మస్ట్. స్విచ్ ఆన్ చేయగానే నిమిషాల్లోనే నీరు వేడి ఎక్కుతుంది. అందుకే, దీనిని వాడేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఎంత సౌకర్యంగా ఉంటాయో అంతే డేంజర్ కూడా.
గీజర్ లో ఉండే ప్రెజర్ రిలీఫ్ వాలు పాడైతే గీజర్ లో హై ప్రెజర్ అవుతుంది. ఇలాంటి సందర్బంలో అవి పేలుతాయి. అంతేకాదు వాటర్ ఎక్కువగా వేడి కాకుండా కంట్రోల్ చేసే థర్మోస్టర్ పాడైతే, గీజర్ లో సెడిమెడ్స్ ఫామ్ అయినా గీజర్ లో ఎక్కువ ఒత్తిడి జరిగి పేలుతుంది. మరి ఇది పాడైందనే విషయం ఎలా తెలుసుకోవాలంటే? దీని నుంచి సౌండ్లు, పొగలు వచ్చినా మీ గీజర్ రిపేర్ కి వచ్చిందని అర్థం చేసుకొని వెంటనే వాటర్ సప్లే, కరెంట్ సప్లే ను ఆఫ్ చేయండి. వెంటనే టెక్నీషియన్ కు చూపించండి. ఎలాంటి దుర్ఘటనలు జరగవద్దు అంటే సంవత్సరానికి ఒకసారి గీజర్ ప్రాపర్ మెయింటెన్ చాలా అవసరం.
గీజర్లని ఎక్కువసేపు ఆన్ చేసి ఉంచితే వేడి ఎక్కుతుంది. ఇలాంటి సమయంలో కూడా గీజర్ పేలుతుంది. కొందరు గీజర్ వేసి మర్చిపోతుంటారు. దీని వల్ల అది వేడెక్కుతుంది. అంతేకాదు బాయిలర్ ఒత్తిడిని కలిగించి లీకేజ్ అయ్యేలా చేస్తుంది. కరెంట్ షాక్ తో కూడా పేలుతుంది. అందుకే చాలా సమయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.