వైద్య రంగానికి చంద్రబాబు సమూల చికిత్స

ఏపీలో కూటమి ప్రభుత్వం వైద్య రంగం పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. రాష్ట్రంలో అధునాతన వైద్య సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. అమరావతిలో ప్రఖ్యాత ఆస్పత్రుల ఏర్పాటు దిశగా కసరత్తు జరుగుతోంది. మంగళగిరి ఏయిమ్స్ కు దేశంలో మరెక్కడా లేని విధంగా వసతుల కల్పనకు నిర్ణయించారు. వైద్య విద్యలో సంస్కరణలతో పాటుగా సమూలంగా వైద్య రంగానికి చికిత్స చేసేందుకు చంద్రబాబు డిసైడ్ అయ్యారు.


వైద్య రంగానికి చికిత్స ఏపీలో వైద్య రంగంలో సంస్కరణల దిశగా చంద్రబాబు కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. ప్రధానం గా పేదలకు తక్కువ ధరలకే ఆధునిక వైద్యం అందించేందుకు ప్రణాళికలు ఖరారు దిశగా అడు గులు పడుతున్నాయి. రాజధాని అమరావతిని హెల్త్ హబ్ గా తీర్చి దిద్దాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా దేశంలోని ప్రఖ్యాత ఆస్పత్రులు అమరావతి లో ఏర్పాటు దిశగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముందుకు వెళ్తున్నారు. టెక్నాలజీ వినియోగంతో వైద్య రంగంలో అద్భుతాలు సాధించేలా ప్రభుత్వం నుంచి సహకారం అందించాలని నిర్ణించారు. రోగుల వద్దకే వైద్య సేవలు అందించే కొత్త విధానం తీసుకువచ్చేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.

హెల్త్ హబ్ గా అమరావతి రోగులు తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప ఆస్పత్రులకు వెళ్లకుండా.. ఇళ్ల వద్దే వారికి వైద్య చికిత్స అందించేలా వైద్య రంగాన్ని సాంకేతిక పరిజ్ఞానంతో తీర్చిదిద్దేలా కార్యాచరణ ఉండాలని సీఎం చంద్రబాబు నిర్దేశించారు. మంగళగిరిలోని ఏయిమ్స్ కోసం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకు న్నారు. దేశంలో ఏ ఎయిమ్స్‌కూ లేని విధంగా మంగళగిరి ఎయిమ్స్‌కు మంచి వాతావరణంలో దాదాపు 183 ఎకరాలు ప్రభుత్వం కేటాయించింది. మరో పది ఎకరాల స్థలం కావాలని తాజాగా ఏయిమ్స్ డైరెక్టర్ అభ్యర్ధనకు చంద్రబాబు వెంటనే ఆమోదం తెలిపారు. కొలనుకొండ వద్ద పది ఎకరాల స్థలం కేటాయించేందుకు నిర్ణయించారు. చంద్రబాబు ప్రకటన ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి ఏయిమ్స్ మంజూరు అయింది. నాడు చంద్రబాబు సీఎం గా ఉన్న సమయంలోనే మంగళగిరిలో 960 పడకల సామర్థ్యం ఉన్న ఎయిమ్స్‌ను రూ.1,618 కోట్లతో నిర్మించారు. 2019 లో ప్రభుత్వం మారిన ఏయిమ్స్ కు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందలేదు. కనీసం..నీటి వసతి కూడా కల్పించలేదు. ఇప్పుడు తిరిగి చంద్రబాబు సీఎం అయిన తరువాత ఏయిమ్స్ కు పూర్తి సహకారం అందిస్తున్నారు. భవిష్యత్‌లో మరింతగా సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధమని ప్రకటించారు. ఏయిమ్స్ లో అధునాతన వైద్యం రూ 10 కే అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు 8వ స్థానంలో ఉన్న మంగళగిరి ఎయిమ్స్‌ మొదటిస్థానానికి రావాలని ఆకాంక్షించారు.

ముందుకొచ్చిన ప్రభుత్వం ప్రభుత్వం మరో పది ఎకరాలు కేటాయిస్తే ట్రామాకేర్‌ యూనిట్‌, మెడికల్‌ టెక్నాలజీ విభాగాలు ఏర్పాటు చేస్తామని ఏయిమ్స్ డైరెక్టర్‌ మాధవానంద కర్‌ వివరించారు. వెంటనే అంగీకరించిన ముఖ్యమంత్రి ఈ రోజు (గురువారం) జరుగుతున్న మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదన పైన చర్చించనున్నారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి మంత్రి లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్నా రని, ఎయిమ్స్‌ అభివృద్ధిపై తనకు కూడా చాలా బాధ్యత ఉందని తెలిపారు. భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు ఎదురైనా వాటిని పరిష్కరించటమే తమ తొలి ప్రాధాన్యతగా చంద్రబాబు వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో మెడికల్ కాలేజీల గురించి గొప్పగా ప్రచారం చేసుకున్నా, సౌకర్యాలు లేవని గుర్తించిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు వాటి కల్పన పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది.

సంస్కరణల దిశగా ఇక, ఆరోగ్య శ్రీ అమలులోనూ సంస్కరణల దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. భీమా కంపెనీల ద్వారా పది లక్షల వరకు అరోగ్య భీమా అమలు కోసం కసరత్తు మొదలు పెట్టింది. ఇందు కోసం ఆరోగ్య శ్రీ సేవల్లోనూ మరిన్ని చేర్చే అంశం పైన అధ్యయనం మొదలు పెట్టింది. హెల్త్ యూనివ ర్సిటీకి తిరిగి ఎన్టీఆర్ పేరు ఖరారు చేయటంతో పాటుగా గత ప్రభుత్వ హయాంలో యూనివర్సి టీలో జరిగిన ఆర్దిక అంశాల ను సరిదిద్దే కార్యక్రమం ప్రారంభించింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అమలు అవుతున్న వైద్య సేవలను మరింత బలోపేతం చేయటం పైన కసరత్తు చేస్తోంది. ఉద్యోగులు, జర్నలిస్టుల కు హెల్త్ కార్డుల ద్వారా ఆరోగ్య భీమా అందిస్తోంది. రానున్న రోజుల్లో ఆరోగ్య రంగంలో విప్లవాత్మక నిర్ణయాలకు చంద్రబాబు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.