వైఎస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు అయింది. ఏపీ పోలీసులు అంబటి రాంబాబు పై కేసు నమోదు చేశారు. టీడీపీ, జనసేన సోషల్ మీడియా పై ఫిర్యాదు చేసి..
ఇచ్చిన ఫిర్యాదులపై ఎప్పటి లోపు చర్యలు తీసుకుంటారో చెప్పండి అంటూ నిన్న పోలీసు స్టేషన్ ముందు అంబటి రాంబాబు ధర్నాకు దిగారు. ఈ క్రమంలోనే పోలీసుల విధులకు అంటకం కలిగించారని అంబటి రాంబాబు పై గుంటూరు, పట్టాభిపురం పోలీసులు ఈరోజు కేసు నమోదు చేశారు.
దీంతో అక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు వెళ్లగొట్టారు. ఇక తన పై కేసు నమోదు చేయడంపై వైఎస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహించారు. కాగా, రెండు రోజుల క్రితం అంబటి రాంబాబు గుంటూరు పట్టణ పరిధిలోని పట్టాభిపురం పోలీస్ స్టేషన్ కు తన అనుచరులతో కలసి వెళ్లారు. జగన్ పైనా, తమ పార్టీ నేతలపైనా సోషల్ మీడియాలో పెడుతున్న వారిపై కేసులు నమోదు చేయాలంటూ ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, కనీసం తమ నుంచి ఫిర్యాదులు కూడా తీసుకోలేదని ఆయన పోలీస్ స్టేషన్ లో కాసేపు ఆందోళనకు దిగారు. ధర్నా చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే అదే రోజు మంగళగిరి ఎయిమ్స్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కార్యక్రమంలో పోలీసులు విధులు నిర్వహిస్తున్నామని.. తర్వాతి రోజు రావాలంటూ వైఎస్ఆర్సీపీ నేతలకు పోలీసులు అధికారులు చెప్పారు. అయినప్పటికీ పోలీసుల మాటలను పట్టించుకోకుండా అంబటి రాంబాబు పోలీస్‌స్టేషన్ వద్ద బైఠాయించి ప్లకార్డులు పట్టుకుని నిరసన చేశారు. ఈ నేపథ్యంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ వ్యవహారంపై అంబటి రాంబాబుకు పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అంబటి గుంటూరులోని ఆయన నివాసంలో ఉన్నారు.