అల్లు అర్జున్ కి మరో షాక్.. హ్యూమన్ రైట్స్ కి ఫిర్యాదు

www.mannamweb.com


ఈ డిసెంబర్ నెల 5వ తేదీన పుష్ప 2 సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా రిలీజ్ అయింది. అయితే ఒక రోజు ముందుగానే హైదరాబాదులో ఉన్న సింగిల్ స్క్రీన్స్ తో పాటు కొన్ని మల్టీప్లెక్స్ లలో పుష్ప సినిమాను ప్రీమియర్ గా ప్రదర్శించారు.

అందులో సంధ్య థియేటర్ ప్రీమియర్స్ కోసం అల్లు అర్జున్ తో పాటు ఆయన కుటుంబం, హీరోయిన్ రష్మిక కూడా హాజరయ్యారు. అల్లు అర్జున్ వస్తున్న విషయం తెలిసి ఆ సంధ్య థియేటర్ కి ఫ్యాన్స్ తండోపతండాలుగా తరలి వచ్చారు. అల్లు అర్జున్ ను కలిసేందుకు ఎగబడడంతో అక్కడ తొక్కిసలాట ఏర్పడింది. ఈ నేపథ్యంలో రేవతి అనే మహిళ మృతిచెందగా ఆమె కుమారుడు శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతానికి కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.

అయితే తాజాగా చిక్కడపల్లి పోలీసులు సంధ్యా థియేటర్ లైసెన్స్ విషయం మీద షోకాజు నోటీసులు జారీ చేశారు. తొక్కిసలాట కారణంగా ఒకరి మృతికి కారణమైన సంధ్య థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదు అని ప్రశ్నిస్తూ షో కాజ్ నోటీసులు జారీ చేశారు.. ఈ నోటీసుల మీద వారం రోజులలో వివరణ ఇవ్వకపోతే లైసెన్సు రద్దు చేస్తామని కూడా హెచ్చరించారు. అయితే తాజాగా ఈ సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనపై NHRCకి ఫిర్యాదు చేశారు. ఈ ప్రచారం మోజులో పడి ప్రజల ప్రాణాలు తీశారని ఫిర్యాదుదారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రేక్షకులను కంట్రోల్‌ చేయలేమని పోలీసులు చెప్పినా పట్టించుకోలేదు అని పేర్కొన్న ఫిర్యాదు దారు పుష్ప-2 చిత్ర యూనిట్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.