ఏపీలో మద్యం ధరలు తగ్గించుకున్న 11 కంపెనీలు

www.mannamweb.com


క్వార్టర్‌ మీద ఎమ్మార్పీపై రూ.30 వరకు తగ్గుదల

వైకాపా హయాంలో మద్యం మూల ధర (బేసిక్‌ ప్రైస్‌)ను భారీగా పెంచేసిన సరఫరా కంపెనీల్లో కొన్ని ఇప్పుడు వాటంతట అవే తగ్గించుకున్నాయి.

అప్పటి ప్రభుత్వ పెద్దలు ఆయా కంపెనీల నుంచి కమీషన్లు తీసుకునేందుకు వీలుగా వాటికి చెల్లించే మూల ధరల్ని భారీగా పెంచేశారన్న ఫిర్యాదులున్నాయి. కూటమి ప్రభుత్వం నూతన మద్యం విధానం తీసుకొచ్చి వినియోగదారుల డిమాండుకు అనుగుణంగా, పారదర్శకంగా ఆర్డర్లు ఇస్తున్న నేపథ్యంలో.. దాదాపు 11 కంపెనీలు వాటి బేసిక్‌ ప్రైస్‌ను తగ్గించుకున్నాయి. ఫలితంగా ఆయా కంపెనీల నుంచి రాష్ట్ర బెవరేజస్‌ సంస్థ మద్యం కొనే ధర తగ్గింది. ఆయా బ్రాండ్లను బట్టి ఒక్కో క్వార్టర్‌ ధర ఎమ్మార్పీపై రూ.30 వరకూ తగ్గడంతో ఆ మేరకు వినియోగదారులకు ఊరట కలగనుంది.