గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది! చిరంజీవితో కలిసి సినిమా చూసిన సుకుమార్ ఏమన్నాడంటే

www.mannamweb.com


‘గేమ్ ఛేంజర్’ మూవీని డిసెంబర్‌లోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే సంక్రాంతి సీజన్‌కి వస్తే కలెక్షన్లు ఎక్కువ రాబట్టవచ్చనే ఉద్దేశంతో 2025, జనవరి 10న ‘గేమ్ ఛేంజర్’ మూవీని భారీగా రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు..

తమిళ దర్శకుడు శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన సినిమా కావడం, హిందీ హీరోయిన్ కియారా అద్వానీ నటిస్తుండడంతో తెలుగుతో పాటు తమిళ్, హిందీల్లో కూడా ‘గేమ్ ఛేంజర్’ మూవీకి టికెట్లు తెగుతాయని నమ్మకంగా ఉన్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్..

‘గేమ్ ఛేంజర్’ మూవీపైన ఫస్ట్ రివ్యూ చెప్పాడు డైరెక్టర్ సుకుమార్.. ‘నేను, చిరంజీవి గారితో కలిసి గేమ్ ఛేంజర్ మూవీ చూశాను. ఫస్టాఫ్ చాలా బాగా వచ్చింది. ఇంటర్వెల్ ట్విస్ట్‌కి మైండ్ అదిరిపోతుంది. ఫ్లాష్ బ్యాక్ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. క్లైమాక్స్‌లో రామ్ చరణ్ ఎమోషన్స్ పలికించిన విధానం కన్నీళ్లు తెప్పిస్తుంది. రామ్ చరణ్‌ ఈ మూవీలో అవార్డు విన్నింగ్ పర్ఫామెన్స్ ఇచ్చాడు..’ అంటూ చెప్పుకొచ్చాడు డైరెక్టర్ సుకుమార్..

డైరెక్టర్ సుకుమార్‌కి అంత ఈజీగా ఏ సినిమా నచ్చదు. లెక్కల మాస్టర్ సుక్కూకి ‘పుష్ప 2’ మూవీ కూడా పూర్తిగా సంతృప్తిని ఇవ్వలేదు. అయితే నార్త్ జనాలకు బాగా నచ్చేయడంతో బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. దీంతో సుకుమార్‌కి బాగా నచ్చిందంటే ‘గేమ్ ఛేంజర్’ మూవీలో కంటెంట్ కచ్ఛితంగా ఉన్నట్టేనని తెగ సంతోషపడుతున్నారు మెగా ఫ్యాన్స్.. సుకుమార్ చెప్పాడంటే, ‘గేమ్ ఛేంజర్’ సినిమా కోసం మూడేళ్లు కష్టపడిన రామ్ చరణ్‌కి సరైన హిట్టు దక్కినట్టేనని ధీమాగా ఉన్నారు..

ఎస్.జె. సూర్య, శ్రీకాంత్, సునీల్ ముఖ్య పాత్రల్లో నటించిన ‘గేమ్ ఛేంజర్’ మూవీకి తమన్ మ్యూజిక్ అందించాడు. రామ్ చరణ్‌తో ‘రంగస్థలం’ మూవీ చేసి, అతనిలోని నటుడిని తెరపైన అద్భుతంగా ఆవిష్కరించాడు డైరెక్టర్ సుకుమార్. అల్లు అర్జున్‌తో ‘పుష్ప 2’ మూవీ చేసి బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బ్రేక్ చేస్తున్న సుకుమార్, తన తర్వాతి సినిమాని రామ్ చరణ్‌తోనే చేయబోతున్నాడు. అప్పుడెప్పుడో విజయ్ దేవరకొండ, సుకుమార్ కాంబోలో సినిమా ఉంటుందని అనౌన్స్‌మెంట్ పోస్టర్ వచ్చింది..

అయితే విజయ్ దేవరకొండతో సుకుమార్ అనౌన్స్ చేసిన సినిమా దాదాపు ఆగిపోయినట్టే. ఈ స్క్రిప్ట్‌తో సుక్కూ, రామ్ చరణ్‌తో సినిమా చేయబోతున్నాడని కూడా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం బుచ్చిబాబు సన దర్శకత్వంలో సినిమా చేస్తున్న రామ్ చరణ్, ఆ మూవీ షూటింగ్ పూర్తి చేసిన తర్వాత సుకుమార్‌తో సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్తాడు…

ప్రస్తుతం ‘పుష్ప 2’ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్న డైరెక్టర్ సుకుమార్, వచ్చే ఏడాది రామ్ చరణ్‌తో సినిమా మొదలు పెడతాడు.. చెర్రీ, బుచ్చిబాబుతో సినిమా ఫినిష్ చేసేలోపు ప్రీ-పొడక్షన్ పనులను పూర్తి చేయాలని అనుకుంటున్నాడట సుకుమార్..