చీకట్లో పడుకుంటే కలిగే లాభాలేంటి? లైట్లు ఎందుకు ఆఫ్ చేయాలి..?

www.mannamweb.com


నైట్ పడుకునే ముందు చాలా మంది లైట్లు ఆఫ్ చేసుకుని పడుకుంటారన్న విషయం తెలిసిందే. మరీ పడుకునేటప్పుడు లైట్లు ఎందుకు ఆఫ్ చేస్తారు?

కలిగే లాభాలేంటి? అని చాలా మందిలో తలెత్తిన ప్రశ్నలకు సమాధానాలేంటో.. నిపుణులు చెప్పినవి ఇప్పుడు చూద్దాం..

లైట్లు నిద్రకు కారణమయ్యే మెలటోనిన్ హార్మోన్(Melatoninhormone) ఉత్పత్తిని నిరోధిస్తుంది. దీంతో నిద్రపట్టకుండా మీ మెదడు పనిచేసేలా ప్రేరేపిస్తుంది. కాగా నిద్ర నాణ్యత మరింత తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.అంతేకాకుండా పలు ఆరోగ్య సమస్యల(Health problems)కు కూడా దారితీస్తుందట. అలాగే రాత్రిపూట సరిగ్గా నిద్రలేకపోతే అధిక రక్తపోటు(high blood pressure), ఊబకాయం(obesity), డయాబెటిస్(Diabetes) వంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు వివరిస్తున్నారు.

చీకట్లో నిద్రపోవడం ఎందుకు ముఖ్యం..?

చీకట్లో నిద్రిస్తే మెదడుకు విశ్రాంతి దొరుకుతుంది. మంచి నిద్రకు దారితీస్తుంది. చీకట్లో శరీరానికి కూడా ఉపశమనం కలుగుతుంది. దీంతో నెక్ట్స్ డే మరింత ఉత్సాహంతో వర్క్ చేసుకోవచ్చు. అలాగే ఒత్తిడి స్థాయిల(Stress levels)ను తగ్గించడంలో మేలు చేస్తుంది. చీకటిలో నిద్రపోవడం అనేది మరో ఆలోచన లేకుండా మనస్సును స్థిరీకరిస్తుంది. కళ్లకు విశ్రాంతి దొరుకుతుంది. రోజంతా కళ్లతో చూస్తూ పని చేస్తుంటారు కాబట్టి కళ్లపై ఒత్తిడి అనేది తగ్గుతుంది.

పడుకునే రూంలో లైట్లు ఆన్ లో ఉంటే శరీరంలోని అన్ని పార్ట్స్ విశ్రాంతి తీసుకోలేవని నిపుణులు చెబుతున్నారు. అలాగే లైట్లు ఉంటే రోగనిరోధక శక్తి(Immunity)పై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంటుందట.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.