వాస్తు ప్రకారంగా కొన్ని విషయాలను అనుసరించినప్పుడే మన జీవితం బాగుంటుందని అలాగే అనేక రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు అని చెబుతున్నారు. అంతేకాకుండా వాస్తు ప్రకారంగా మనం పాటించే కొన్ని రకాల నియమాలు మన జీవితంలో ఎదుర్కొనే చాలా రకాల సమస్యలను తగ్గిస్తాయట.
అయితే కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనం చేసే కొన్ని పనులు మనకు తీవ్ర కష్టాలను తెచ్చిపెడతాయట. మనకు తెలియకుండానే మన జేబులో ఉంచుకునే కొన్ని పెట్టుకుంటాం. అయితే వాటి వల్ల మన దగ్గర డబ్బు, సంపద ఉండదని ఆర్థిక సంక్షోభానికి గురవుతామని వాస్తు శాస్త్రం చెబుతోంది. వాస్తు ప్రకారం జేబులో డబ్బు ఉంచుకోవడం సాధారణ విషయం. కానీ చాలా సార్లు మనం డబ్బులతో పాటుగా కొన్ని ఇతర అనవసరమైన వస్తువులను ఉంచుతుంటాం. అయితే ఇలా చేయడం మనల్ని అనుకోని ఖర్చులు, ఆర్థిక సమస్యలకు దారితీస్తుందట.
వాస్తు శాస్త్రం ప్రకారం డబ్బు కాకుండా ఇతర వస్తువులను మీ జేబులో ఉంచుకోవడం వల్ల మీ ఖర్చులు పెరుగుతాయట. ఇది మాత్రమే కాదు డబ్బు ప్రవాహానికి కూడా అంతరాయం ఏర్పడుతుందని, కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. మరి మన జేబులో ఎలాంటివి ఉంచుకోకూడదు అన్న విషయానికి వస్తే.. ఎప్పుడు కూడా చిరిగిన వాలెట్ ను ఉంచుకోకూడదట. ఇది ఆర్థిక సంక్షోభానికి సంకేతంగా పరిగణించబడుతుందని చెబుతున్నారు. అలాంటి చిరిగినా పర్స్ మీ జోబులో ఉండటం వల్ల జీవితంలో ఆర్థిక కొరత ఏర్పడుతుందట. మీ వాలెట్ లో పాత రసీదులు,విజిటింగ్ కార్డ్లు లేదా చిరిగిన నోట్లు వంటివి పెట్టుకోకూడదని చెబుతున్నారు. ఇవి దురదృష్టాన్ని తెస్తాయట. లక్ష్మీదేవికి కూడా కోపం రావచ్చని చెబుతున్నారు. అలాగే మీ జోబులో కోపం లేదా అసూయ వంటి భావాలను కలిగించే ఫోటోలను పెట్టుకోకూడదట.
ఇలాంటి ఫొటోలు నెగెటివ్ ఎనర్జీని తెస్తాయట. వాస్తు ప్రకారం ఇవి మీ ఆర్థిక ఆరోగ్యాన్ని కూడా క్షీణింపజేస్తాయని చెబుతున్నారు మందులను లేదా మెడిసిన్స్ కొనుగోలు చేసేటప్పుడు అవి మీ జేబులో పెట్టుకోకూడదని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల మీ ఆరోగ్యం, శ్రేయస్సుపై ప్రతికూల ప్రభావం పడుతుందని నమ్ముతారు. ఔషధంతో సంబంధం ఉన్న శక్తి మీ సంపద, శ్రేయస్సుకు మంచిది కాదని పండితులు చెబుతున్నారు..