ఒకటి కాదు రెండు కాదు.. వందలాది గొర్రెలు ఉన్న మంద అది.. తెలంగాణ ప్రాంతం నుంచి మేపుల (మేత) కోసం ఆంధ్ర ప్రాంతానికి వలస వెళ్తున్నది.. రోడ్డు పక్కగానే గొర్రెల కాపరులు వాటిని తోలుకు వెళ్తున్నారు.
కానీ ఆ మంద కనిపించిందా? లేక జంతువులే అనుకున్నాడో? స్పీడ్ కంట్రోల్ కాలేదా? నిద్ర మత్తులో ఉన్నాడో? కానీ ఆ మందపై నుంచే బస్సును పోనిచ్చాడు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఆ మందలోని 150 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. దీంతో 12 లక్షల మేరకు ఆ గొర్రెల పెంపకందారులు నష్టపోయారు.
palnadu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా దాచేపల్లి పటట్ణంలోని అలంకార్ థియేటర్ సమీపంలో గొర్రెల మందపై మారుతీ ట్రావెల్స్ బస్సు దూసుకుపోయింది. హైదరాబాద్ నగరం నుంచి ఇంకొల్లు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇదే ఘటనలో 150 గొర్రెలు చనిపోగా, గొర్రెల కాపరి మల్లేశ్ కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో తీవ్ర నష్టం రావడంతో గొర్రెల కాపరులు దుఃఖసారగంలో మునిగిపోయారు.
palnadu: తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లా ధన్వాడ ప్రాంతం నుంచి దాచేపల్లి మండలం మాదినపాడుకు ఈ గొర్రెల మంద వెళ్తుండగా ట్రావెల్స్ బస్సు డ్రైవర్ ఈ దురాఘతానికి పాల్పడ్డాడు. ప్రమాదానికి అతివేగమే కారణమని స్థానికులు చెప్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.