Athibala Plant : మనకు రోడ్ల పక్కన, పొలాల దగ్గర, చేలల్లో, ఖాళీ ప్రదేశాల్లో కనిపించే ఔషధ మొక్కలల్లో అతిబల మొక్క కూడా ఒకటి. చాలా మంది ఈ మొక్కను పిచ్చి మొక్కగా, కలుపు మొక్కగా భావిస్తూ ఉంటారు.
కానీ ఈ మొక్క ప్రయోజనాలు తెలిస్తే మాత్రం వెతికి మరీ ఇంటికి తెచ్చుకుంటారు. అతిబల మొక్క వల్ల మనకు కలిగే లాభాలు అన్ని ఇన్ని కావు. ఆయుర్వేదంతో పాటు తంత్ర శాస్త్రంలో కూడా ఈ మొక్కను ఉపయోగిస్తారు. అతిబల మొక్కను ముదురు బెండమొక్క అని కూడా అంటారు. ఈ మొక్కకు పసుపు రంగులో పూలు ఉంటాయి. మన శరీరానికి బలాన్నిఇవ్వడంలో ఈ మొక్క మనకు ఎంతగానో సహాయపడుతుంది. ఈ మొక్క ఆకుల రసాన్ని వారానికి రెండు సార్లు తాగడం వల్ల నీరసం, బలహీనత తగ్గి శరీరానికి బలం కలుగుతుంది.
మూత్రపిండాలకు, కళ్లకు సంబంధించిన సమస్యలను తగ్గించడంలో కూడా ఈ మొక్క మనకు సహాయపడుతుంది. అయితే ఆరోగ్యపరంగా కాకుండా తంత్రశాస్త్ర పరంగా అతిబల మొక్కను ఎలా ఉపయోగించాలి…. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తు దోషాలు, గ్రహ దోషాలు, పితృ దోషాల కారణంగా కొన్నిసార్లు మనం ఎంత ముందుకు వెళ్లాలన్నా వెళ్లలేకపోతూ ఉంటాము. మన దగ్గర డబ్బుకు లోటు ఏర్పడుతుంది. వ్యాపారంలో నష్టాలు వస్తూ ఉంటాయి. ఇటువంటి సమస్యలను పరిష్కరించడంలో అతిబల చెట్టు మనకు ఎంతో సహాయపడుతుంది. జాతక దోషాలను, గ్రహ దోషాలను తగ్గించి మనకు మేలు చేయడంలో అతిబల మొక్క ఎంతో దోహదపడుతుంది. జీవితంలో పురోగతి కావాలనుకున్న వారు, ఆగిన పనులు పూర్తి కావాలనుకునే వారు ఇప్పుడు చెప్పే తంత్రాన్ని పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
దీని కోసం బుధవారం నాడు సూర్యుడు ఆస్థమించిన తరువాత వేర్లతో సహా అతిబల మొక్కను ఇంటికి తెచ్చుకోవాలి. తరువాత ఈ మొక్క వేర్లను గంగాజలంతో శుభ్రపరచాలి. గంగాజలం అందుబాటులో లేని వారు మంచి నీటిలో కర్పూరం, పసుపు వేసి ఆ నీటితో వేర్లను శుభ్రపరుచుకోవాలి. ఇలా శుభ్రపరిచిన తరువాత ఈ మొక్క వేరు నుండి ముక్కను తీసుకుని వెండి తాయత్తులో ఉంచాలి. ఈ తాయత్తును దేవుడి ముందు ఉంచి పూజించి మెడలో లేదా చేతికి ధరించాలి. ఇలా చేయడం వల్ల మీరు జీవితంలో పురోగతిని సాధిస్తారు. ఆగిన పనులు చక్కగా పూర్తవుతాయి. అలాగే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉండడం వల్ల ఇంట్లో లక్ష్మీ దేవి అడుగు పెట్టదు. దీంతో డబ్బుకు లోటు ఏర్పడుతుంది. అలాంటప్పుడు శనివారం నాడు సూర్యుడు అస్థమించిన తరువాత అతిబల మొక్క వేరును ఇంటిని తీసుకువచ్చి శుభ్రంగా కడగాలి. తరువాత ఈ వేరును దేవుడి దగ్గర ఉంచి పూజించాలి. ఇప్పుడు ఈ వేరును నల్లటి వస్త్రంలో ఉంచి మూట కట్టి ఇంటి ముందర కట్టాలి.
ప్రతి 21 రోజులకొకసారి ఈ వేరును మారుస్తూ ఉండాలి. మరలా శనివారం నాడు సూర్యుడు ఆస్థమించిన తరువాతే కొత్త వేరును తీసుకువచ్చి కట్టాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. లక్ష్మీదేవిఇంట్లోకి అడుగు పెడుతుంది. డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. అలాగే వ్యాపారంలో నష్టాలు అధికంగా ఉన్న వారు సోమవారం నాడు అతిబల మొక్క వేరును తీసుకు వచ్చి శుభ్రంగా కడిగి ఎర్రటి వస్త్రంలో మూట కట్టాలి. తరువాత ఈ మూటను మీరు మీ వ్యాపారంలో డబ్బు ఉంచే చోట ఉంచాలి. 11 రోజులకు లేదా 21 రోజులకు ఈ మూటను పారే నీటిలో వదిలి రావాలి. ఇలా చేయడం వల్ల వ్యాపారం మంచిగా సాగుతుంది. ఈ విధంగా అతిబల మొక్క మనకు తంత్రపరంగా కూడా ఎంతో మేలు చేస్తుందని పండితులు చెబుతున్నారు.