AP Rains: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం..కోస్తా జిల్లాలకు భారీ వర్షాలు!

www.mannamweb.com


Ap Rains: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతున్ననేపథ్యంలో రాష్ట్రంలో కోస్తా జిల్లాలకు భారీ వర్షాలు ముప్పు పొంచి ఉంది. ఏపీ,ఉత్తర తమిళనాడు తీరాల వైపు అల్పపీడనం పయనిస్తుందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.

Also Read: సంధ్య థియేటర్ ఘటన.. వాళ్ళు అనుకూలంగా మార్చుకుంటున్నారు : విజయశాంతి

ఇది మళ్లీ బలపడుతుందా లేక బలహీనపడుతుందా అనే దాని మీద స్పష్టత లలేదు. ప్రస్తుతం తీరానికి సమీపంలో కదులుతున్న నేపథ్యంలో మేఘాలు కమ్ముకుని ,చలిగాలులు వీస్తున్నాయి.

దీని ప్రభావంతో గురువారం వరకు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది.మంగళవారం విశాఖ, అనకపల్లి, కాకినాడ, కోనసీమ,తూర్పు,పశ్చిమ,కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం,మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది.

బుధవారం తిరుపతి,నెల్లూరు, పొట్టిశ్రీరాములు, ప్రకాశం, పల్నాడు,బాపట్ల జిల్లాల్లో ఓ మోస్తరు నుంచిభారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. సముద్రంలో గరిష్ఠంగా గంటకు 55 కి.మీ వేగంతో గాలులు వీస్తున్న నేపథ్యంలో బుధవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విశాఖ వాతావరణ కేంద్రం సూచించింది.

రాష్ట్రంలోని కళింగపట్నం,విశాఖ, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాపట్నం, కృష్ణపట్నం సమా తమిళనాడులోని వివిధ పోర్టుల్లో మూడో నెంబరు ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి.