రైల్వేలో 32 వేల 438 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అర్హతలు ఇవే

www.mannamweb.com


రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) 32వేల 438 గ్రూప్- డి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ 2025, జనవరి 23 నుండి ప్రారంభమవుతుంది.

అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు తదుపరి ప్రక్రియకు పిలవబడతారు. ఈ విషయాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి.

మొత్తం ఖాళీలు: 32,438

విభాగాల వారీగా పోస్టులు:

ట్రాక్ మెయింటెయినర్ Gr. IV ఇంజనీరింగ్: 13, 187
పాయింట్స్‌మన్-బి: 5,058
అసిస్టెంట్ (ట్రాక్ మెషిన్): 799
అసిస్టెంట్ (బ్రిడ్జ్): 301
అసిస్టెంట్ పి-వే: 257
అసిస్టెంట్ (C&W): 2,587
అసిస్టెంట్ (TRD): 1, ​​381
అసిస్టెంట్ (S&T): 2,012
అసిస్టెంట్ లోకో షెడ్ (డీజిల్): 420
అసిస్టెంట్ లోకో షెడ్ (ఎలక్ట్రికల్): 950
అసిస్టెంట్ ఆపరేషన్స్ (ఎలక్ట్రికల్): 744
అసిస్టెంట్ TL & AC: 1041
అసిస్టెంట్ TL & AC (వర్క్‌షాప్): 624
అసిస్టెంట్ (వర్క్‌షాప్) (మెక్): 3,077
విద్యార్హతలు: అభ్యర్థి తప్పనిసరిగా 10వ తరగతి విద్యార్హత మరియు NCVT నుండి నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ (NAC) కలిగి ఉండాలి. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా అర్హులు.

వయో పరిమితి:జూలై 1, 2025 నాటికి 18 మరియు 26 సంవత్సరాల మధ్య ఉండాలి. RRB నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు చేయు విధానం: ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారమ్‌లను ఆన్‌లైన్ లో సమర్పించలి. ఆన్‌లైన్ అప్లికేషన్‌ల లింక్ RRBల అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.

దరఖాస్తు ఫీజు:

జనరల్, OBC, EWS: రూ 500/-
SC, ST, PH: రూ. 250/-
అన్ని కేటగిరీ స్త్రీలు: రూ 250/- (స్టేజ్ I పరీక్షకు హాజరైన తరువాత అభ్యర్థులు చెల్లించిన ఫీజు వాపసు చేస్తారు)

ఎంపిక విధానం

కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)
ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET)
డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV)
మెడికల్ టెస్ట్
పరీక్షా విధానం:

రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో మొదట కంప్యూటర్ ఆధారిత పరీక్షలో ఉతీర్ణులు అవ్వాలి.

జనరల్ సైన్స్: 25 ప్రశ్నలు
గణితం: 25 ప్రశ్నలు
జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్: 30 ప్రశ్నలు
జనరల్ అవేర్‌నెస్: 20 ప్రశ్నలు (తప్పు సమాధానాలకు 1/3 మార్కు కోత)
మరిన్ని పూర్తి వివరాల కోసం అభ్యర్థులు RRB అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.