ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలను ఓ అంతర్జాతీయ మీడియా సంచలన కథనం ప్రచురించింది. ఎన్నికలకు ముందు ప్రజల వ్యక్తిగత వివరాలను వైసీపీ ప్రభుత్వం సేకరించిందని అల్ జజీరా మీడియా పేర్కొంది.
ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని గత వైసీపీ సర్కార్ దుర్వినియోగం చేసినట్లు అల్ జజీరా మీడియా స్పష్టం చేసింది. ఏపీలో వైసీపీ రెండో సారి అధికారంలోకి రావడం కోసం చేసిన డేటా సేకరణపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంతో వైసీపీ ప్రభావిత రాజకీయాలను అల్ జజీరా అంతర్జాతీయ మీడియా తేట తెల్లం చేసింది.
YCP: గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తాము అమలు చేసే సంక్షేమ పథకాల కోసం వాలంటీర్లను నియమించుకుంది. దాదాపు 2 లక్షల 60 వేల మంది వాలంటీర్లను గ్రామాల్లో నియమించుకుని ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లింది. అయితే సరిగ్గా ఎన్నికల సమయంలోనే వీరిని ఉపయోగించుకున్నారనే ప్రచారం జరిగింది. వైసీపీ అనుకూలంగా వాలంటీర్లు ఎన్నికల్లో ప్రచారం చేశారంటూ గతంలో ప్రతిపక్షాలు ఆరోపించాయి. వైసీపీకి సంబంధించిన వ్యక్తులకే సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, పార్టీకి అనుకూలంగా లేని వారిని తొలగించారనే విమర్శలు సైతం వినిపించాయి.
YCP: సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందు వాలంటీర్లను రంగంలోకి దింపిన వైసీపీ వారితో ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరించినట్లు అల్ జజీరా మీడియా స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వ పథకాల నుంచి కొందరు మహిళలను తొలగించడంతో పలువురు హైకోర్టును ఆశ్రయించినట్లు అల్ జజీరా మీడియా వెల్లడించింది. ఈ క్రమంలో హైకోర్టు వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో తిరిగి వారికి పథకాలు పునరుద్ధరించిందని అల్ జజీరా మీడియా తెలిపింది. అయితే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం సేకరించిన వ్యక్తిగత సమాచారంను ఎలా యాక్సెస్ చేసి దుర్వినియోగం చేశారనే అనుమానాలకు దారి తీసింది.
YCP: ప్రజల నుంచి వాలంటీర్లు సేకరించిన డేటాలో ఓటర్ ప్రొఫైల్స్ తయారు చేయడానికి, రాజకీయ ప్రాధాన్యతలను అంచనా వేయడానికి ఈ సమాచారాన్ని ఉపయోగించినట్లు అల్ జజీరా మీడియా తెలిపింది. వాలంటీర్లు సేకరించిన సమాచారాన్ని వైసీపీలోని కీలక నేతలకు చేరవేసినట్లు తమ కథనంలో తెలిపింది. అయితే ప్రభుత్వ పథకాల నుంచి తొలగించిన వారందరిలో అధిక సంఖ్యలో ఉంది టీడీపీ మద్దతుదారులేనని స్పష్టం చేసింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన తమ ప్రయోజనాలను రద్దు చేశారంటూ బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు తొలగించడంపై రాష్ట్ర ప్రభుత్వం అప్పటి వైసీపీ సర్కార్‌ను మందలించిందని అల్ జజీరా కథనం ఆరోపించింది.
YCP: అయితే రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాల్లో భాగంగా సర్వేల ద్వారా ఓటర్ల ప్రాధాన్యాతలను తెలుసుకునేందుకు వివిధ సర్వేల ద్వారా డేటాను సేకరిస్తాయి. కానీ వైసీపీ హయాంలో ఏకంగా ప్రభుత్వ యంత్రాంగం ద్వారానే ప్రజల వ్యక్తిగత సమాచారంను సేకరించి దుర్వినియోగం చేశారంటూ అల్ జజీరా మీడియా సైతం ఆరోపించింది.
ఈ వాలంటీర్ల నియామకం కూడా పార్టీ నియమించిన నిర్వహణ సలహాదారుల సంప్రదింపులతో చర్చలు జరిపి వాలంటీర్ల పథకం అమలు చేసినట్లు తెలిపింది.తాత్కాలిక కమిటీల ద్వారా గ్రామాల్లోని స్థానికుల నుంచి అప్లికేషన్లు తీసుకుని ఇంటర్వ్యూల ద్వారా నియామకాలు చేపట్టినట్లు ఈ మీడియా కథనం వెల్లడించింది.
YCP: ఇక వాలంటీర్లు సేకరించిన డేటాను విశ్లేషించడానికి వైసీపీ ప్రభుత్వం 2019లో ఫీల్డ్ ఆపరేషన్స్ ఏజెన్సీ ఏర్పాటు చేసింది. ఇందు కోసం నియమించడానికి టెండర్‌ను దాఖలు చేసింది. అధునాతన టెక్నాలజీతో అప్లికేషన్ డిజైన్, డెవలప్‌మెంట్ కోసం ఈ FOAను ఏర్పాటు చేసింది. వాలంటీర్లకు శిక్షణ కోసం ఈ FOAను ఏర్పాటు చేసిన గత వైసీపీ సర్కార్. కాగా ఈ కాంట్రాక్ట్‌ను రామిన్ కో లిమిటెడ్ నేతృత్వంలోని కంపెనీ దక్కించుకుంది. ఇక పార్గీ కార్యకలాపాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైసీపీ ఐప్యాక్‌తో ఒప్పందం చేసుకుంది. ఇది రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు అందరినీ ఏకం చేసేందుకు ఈ రెండు సంస్థలూ పనిచేశాయని అల్ జజీరా మీడియా కథనం వెల్లడించింది.