Breaking: గుజరాత్‌లో ఘోర ప్రమాదం.. 14 మంది విద్యార్థుల మృతి

గుజరాత్‌ వడోదరలో ఘోర ప్రమాదం జరిగింది. హరాణీ సరస్సులో గురువారం పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 14 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు మృతి చెందారు.
ప్రమాద సమయంలో పడవలో 23 మంది విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. రెస్క్యూ టీమ్ సరస్సు నుంచి ఐదుగురు పిల్లలను రక్షించింది. ప్రస్తుతం సరస్సులో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మొత్తం 27 మంది విహారయాత్ర భాగంగా బోటులో ఎక్కారు. అయితే ప్రమాదవశాత్తు సరస్సులో బోటు బోల్తా పడింది.


👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.