రోజూ మనం కచ్చితంగా స్నానం చేయాల్సిందే. స్నానం చేయడం వల్ల అలసిన శరీరానికి ఆహ్లాదం లభిస్తుంది. దీంతో నిద్ర చక్కగా పడుతుంది. అందుకని రోజూ ప్రతి ఒక్కరు రెండు పూటలా స్నానం చేయాల్సి ఉంటుంది.
రాత్రి పూట స్నానం చేస్తే ఒత్తిడి, ఆందోళన తగ్గడంతోపాటు చక్కగా నిద్ర కూడా పోవచ్చు. అయితే మీరు రోజూ ఉదయం పూట స్నానం చేసే నీటిలో మాత్రం ఇప్పుడు చెప్పబోయే ఒక పదార్థాన్ని కలిపి స్నానం చేయండి. దీంతో అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఇక ఆ ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు స్నానం చేసే నీటిలో కొద్దిగా ఆలం (పటిక)ను కలిపి స్నానం చేయండి. దీంతో మీకు ఉండే అన్ని రకాల చర్మ వ్యాధులు పోతాయి. చర్మం కాంతివంతంగా మారి మెరుస్తుంది. మృదువుగా తయారవుతుంది. యవ్వనంగా కనిపిస్తారు. వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. ముఖంపై ఉండే ముడతలు, మచ్చలు పోతాయి. ఇక పటికను నీళ్లలో కలిపి ఆ నీటితో స్నానం చేయడం వల్ల శరీరంలోని ఎలాంటి నొప్పులు అయినా సరే తగ్గిపోతాయి.
ముఖ్యంగా కండరాలు, కీళ్లు, మోకాళ్ల నొప్పులతోపాటు ఒళ్లు నొప్పుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. కొందరికి స్నానం చేసినా కూడా శరీరం దుర్వాసన వస్తుంటుంది. అలాంటి వారు స్నానం చేసే నీటిలో పటికను కలిపి స్నానం చేయడం వల్ల ఈ సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు. కాలిన గాయాలు లేదా ఇతర గాయాలు, పుండ్లు ఉన్నవారు ఆలం కలిపిన నీళ్లతో కడుగుతుండడం వల్ల అవి త్వరగా మానుతాయి. ఇక షాంపూ కలిపిన నీళ్లలో ఆలం కలిపి దాంతో తలస్నానం చేస్తే శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇలా పటిక వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. కనుక దాన్ని ఉపయోగించడం మరిచిపోకండి.